టైప్ 1.5 డయాబెటీస్ గురించి ఎప్పుడైనా విన్నారా? ఇది ఆ ఏజ్ వాళ్లకే వస్తుంది జాగ్రత్త..

Published : Apr 24, 2023, 09:42 AM IST

టైప్ 1, టైప్ 2 డయాబెటీస్ ల గురించి అందరికీ తెలుసు. కానీ టైప్ 1.5 డయాబెటీస్ గురించి మాత్రం చాలా తక్కువ మందికే తెలుసు. అసలు ఈ వ్యాధి ప్రమాదం ఎవరికి ఎక్కువగా ఉంది? దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే? 

PREV
16
టైప్ 1.5 డయాబెటీస్ గురించి ఎప్పుడైనా విన్నారా? ఇది ఆ ఏజ్ వాళ్లకే వస్తుంది జాగ్రత్త..
diabetes

టైప్ 1.5 డయాబెటీస్ కూడా టైప్ 1 డయాబెటిస్ మాదిరిగానే స్వయం ప్రతిరక్షక వ్యాధి. శరీరం ప్రతిరోధకాలు ప్యాంక్రియాస్ ఇన్సులిన్ ను తయారుచేసే కణాలపై దాడి చేసినప్పుడు ఈ వ్యాధి వస్తుంది. అయితే ఈ టైప్ 1.5 లేదా లాడా చాలా రేర్ గా వస్తుందని నమ్ముతారు. కానీ ఇతర డయాబెటీస్ రకాలు మాత్రం ఇలా కాదని నమ్ముతారు. లాడా టైప్ 1, టైప్ 2 డయాబెటిస్ మధ్య వస్తుందని మాయోక్లినిక్ నిపుణులు అంటున్నారు. లాడా ఉన్నవారిని టైప్ 2 డయాబెటీస్ పేషెంట్లుగా పరిగణిస్తారు. ఎందుకంటే ఈ డయాబెటిస్ లక్షణాలు 30 ఏండ్లు పైబడిన వారిలో కనిపిస్తాయి.

26
diabetes

30-35 ఏళ్లు పైబడిన వారికే ప్రమాదం

లాడా  లేదా టైప్ 1.5 డయాబెటీస్ యుకులకు వస్తుంది. అంటే ఈ వ్యాధి 30 నుంచి 35 ఏండ్లు పైబడిన వారికి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఇమ్యునాలజీ ఫర్ డయాబెటిస్ సొసైటీ (ఐడిఎస్) లాడాను మూడు ప్రమాణాల కింద గుర్తిస్తుంది. ఒకటి వయస్సు ఆధారంగా.. అంటే 30 సంవత్సరాల కంటే ఎక్కువ. రెండు ప్రారంభ రోగ నిర్ధారణ తర్వాత కనీసం 6 నెలలు ఇన్సులిన్ పై ఆధారపడకపోవడం. మూడు ఐలెట్ బీటా కణాలకు సానుకూల ఆటోఆంటిబాడీస్.
 

36
Diabetes

లాడా లక్షణాలు

లాడా ఉన్నవారు పాలియూరియా -అంటే సాధారణం కంటే ఎక్కువసార్లు మూత్ర విసర్జన  చేయడం. పాలిడిప్సియా - అంటూ అధిక దాహం.  నోక్టురియా - అంటే రాత్రిళ్లు మూత్రవిసర్జన కోసం తరచుగా లేవడం. అలసట, కంటిచూపులో మార్పులు, పాదాలలో జలదరింపు వంటి సంకేతాలు కనిపిస్తాయి. బరువు తగ్గడం కూడా లాడాకు సంకేతమేనంటున్నారు నిపుణులు. అలాగే తక్కువ జనన బరువు చరిత్ర ఈ పరిస్థితికి బలమైన ప్రమాద కారకం. ఒక అధ్యయనం ప్రకారం.. బరువు తగ్గడం, తక్కువ బిఎమ్ఐ అనేది లాడా కేసులలో నాలుగింట మూడు వంతులను గుర్తించడానికి ఒక పరామీటర్.
 

46
diabetes

ఇది టైప్ 1 డయాబెటిస్ మాదిరిగానే ఉన్నప్పటిక.. లాడాలో లక్షణాలు పురోగతి చెందడానికి సమయం పడుతుంది. దీనివల్ల ఈ వ్యాధి ఉన్నవారికి ఆరు నెలల వరకు మందులు అవసరం లేదు. ప్రారంభంలో మంచి ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం, మందులు వంటి ఆరోగ్యకరమైన జీవనశైలి అలవాట్లతో దీన్ని నియంత్రణలో ఉంచుకోవచ్చు. కానీ లక్షణాలు తీవ్రమవుతున్నప్పుడు క్రమంగా ఇన్సులిన్ షాట్లు అవసరం కావచ్చు.

56

లాడా ఉన్నవారు ఏ పరీక్షలు చేయించుకోవాలి?

లాడా ఉన్నవారు డయాబెటిస్ కోసం ఎలాంటి టెస్టులు చేయించుకుంటారో వాటిని చేయించుకోవాలి. అలాగే రక్తంలో గ్లూకోజ్ స్థాయిని క్రమం తప్పకుండా తనిఖీ చేయాలి. ఇది కాకుండా ఈ రోగులు వారి లిపిడ్ ప్రొఫైల్, గ్లోమెరులర్ వడపోత రేటు, సీరం క్రియేటినిన్, అల్బుమిన్, పెరిఫెరల్ న్యూరోపతి, రెటినోపతిని కూడా తనిఖీ చేయాలి.
 

66
World Diabetes Day

అయితే ఈ టైప్ 1.5 లక్షణాలు కనిపించడానికి సమయం పడుతుంది. కాబట్టి 30 ఏళ్లు పైబడిన వారికి ఈ వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అందుకే వీళ్లు టెస్టులు చేయించుకోవడం మంచిది. అయితే చాలా మంది ఈ డయాబెటీస్ ను టైప్ 2 డయాబెటీస్ గా భావిస్తారు. ఒకవేళ మీకు టైప్ 2 డయాబెటిస్ ఉన్నట్టు తేలినా, అలాగే మీరు సన్నగా, శారీరకంగా చురుకుగా ఉన్నా లేదా ఈ మధ్యకాలంలో శ్రమ లేకుండా బరువు తగ్గినా వెంటనే హాస్పటల్ కు వెళ్లండి. డాక్టర్ తో ఇవన్నీ చెప్పడం మంచిది.

click me!

Recommended Stories