వేడి పానీయాలు
ఎండాకాలంలో హైడ్రేట్ గా ఉండటం చాలా ముఖ్యం. అయితే చాలా మంది చల్లని, ప్రిజర్వేటివ్స్ ఎక్కువగా ఉండే పానీయాలను తాగుతుంటారు. కానీ ఇవి మన ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. అందుకే వీటికి బదులుగా గోరువెచ్చని లేదా సాదా నీటిని తాగండి. అలాగే గ్రీన్ టీని రోజుకు రెండుసార్లు తాగితే గొంతు నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. గ్రీన్ టీలో రోజ్మేరీ ఆకులు, పుదీనా ఆకులను కూడా వేయొచ్చు. గొంతులో పేరుకుపోయిన శ్లేష్మాన్ని తొలగించడానికి పుదీనా ఆకులు ఉపయోగపడతాయి.
ఇందుకోసం ఏం చేయాలంటే?
గ్రీన్ టీలో పుదీనా ఆకులను కలుపుకుని తాగితే గొంతునొప్పి సమస్య తగ్గిపోతుంది. వీటితో పాటు అశ్వగంధ, పుదీనా ఆకులు, ములేతి, సోంపు వేసి మరిగించి తాగితే గొంతు ఇన్ఫెక్షన్ కూడా తొలగిపోతుంది. కావాలనుకుంటే దీన్ని టేస్టీగా చేయాలనుకుంటే తేనెను కలపొచ్చు. తేనెలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి మేలు చేస్తాయి. ఇది గొంతులో ఉండే ఇన్ఫెక్షన్ నుంచి ఉపశమనం కలిగిస్తుంది.