పబ్మెడ్ సెంట్రల్ చేసిన ఈ పరిశోధన ప్రకారం.. వెల్లుల్లిలో అల్లిన్, అల్లిసిన్, అజి, అల్లైల్ ప్రొపైల్ డైసల్ఫైడ్, డయల్ ట్రైసల్ఫైడ్, ఎస్-అల్లిల్ మెర్కాప్టో సిస్టీన్ తో పాటుగా అనేక ఇతర ఎంజైమ్లు వంటి సుమారు 33 సల్ఫర్ సమ్మేళనాలు ఉన్నాయి. అవన్నీ మన శరీరంలో వివిధ రకాలుగా పనిచేస్తాయి. అంతేకాకుండా వెల్లుల్లిలో ఉండే 17 అమైనో ఆమ్లాలు శరీరానికి వివిధ రకాలుగా ఉపయోగపడతాయి. అంతేకాదు వెల్లుల్లిలోని ఖనిజాలు సెలీనియం, జెర్మేనియం, టెల్లూరియం కణజాలాలు, కండరాలను ఆరోగ్యంగా ఉంచుతాయి.