Weight Loss: ఖాళీ కడుపుతో వ్యాయామం చేస్తే ఎక్కువ బరువు తగ్గుతారా?

Published : Feb 20, 2025, 01:07 PM IST

బరువు తగ్గడానికి చాలామంది ఉదయం, సాయంత్రం వ్యాయామం చేస్తుంటారు. వ్యాయామం కేవలం వెయిట్ లాస్ కే కాదు పూర్తి శరీర ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కానీ ఖాళీ కడుపుతో వ్యాయామం చేయడం వల్ల నిజంగా బరువు తగ్గుతారా? ఎంత తగ్గుతారు? ఇతర విషయాలు మీకోసం.

PREV
15
Weight Loss: ఖాళీ కడుపుతో వ్యాయామం చేస్తే ఎక్కువ బరువు తగ్గుతారా?

చాలామందికి పొద్దున్నే వ్యాయామం చేయడం అలవాటుగా ఉంటుంది. కొందరైతే గంటల తరబడి వ్యాయామం చేస్తుంటారు. ఉదయాన్నే ఖాళీ కడుపుతో వ్యాయామం చేయడం వల్ల ఎక్కువ బరువు తగ్గుతారని అంతా నమ్ముతారు. అందులో నిజమెంతో ఇక్కడ తెలుసుకుందాం. 

ఉదయం బ్రేక్ ఫాస్ట్ మానేయడం ఆరోగ్యానికి ఎంతమాత్రం మంచిది కాదు. జీర్ణం కావడానికి సులభమైన బ్రేక్ ఫాస్ట్ తిని వ్యాయామం చేయడం వల్ల శరీరానికి తగినంత శక్తి వస్తుంది. కానీ ఖాళీ కడుపుతో వ్యాయామం చేయడం వల్ల ఏం జరుగుతుందో ఇక్కడ చూద్దాం.

25
ఖాళీ కడుపుతో వ్యాయామం

ఖాళీ కడుపుతో వ్యాయామం చేయడాన్ని ఫాస్టెడ్ కార్డియో అంటారు. నిపుణుల ప్రకారం మీరు తినకుండా వ్యాయామం చేయడం వల్ల శరీరంలో నిల్వ ఉన్న కొవ్వు, కార్బోహైడ్రేట్లు శక్తి కోసం ఖర్చు అవుతాయి. దీనివల్ల కొవ్వు త్వరగా తగ్గుతుంది. 

35
పరిశోధన ప్రకారం:

ఓ పరిశోధన ప్రకారం వ్యాయామం చేసే ముందు అల్పాహారం తినని వారి శరీరంలో కొవ్వు ఎక్కువగా కరిగి ఎక్కువ కేలరీలు తగ్గాయట. ఇది బరువు తగ్గడానికి అవసరం. కానీ మరికొన్ని పరిశోధనలు దీనిని తిరస్కరించాయి. ఓ అధ్యయనం ప్రకారం ఖాళీ కడుపుతో వ్యాయామం చేయడం వల్ల చెప్పుకోదగిన మార్పు ఏమీ జరగలేదట.

45
ఖాళీ కడుపుతో వ్యాయామం చేయవచ్చా?

ఖాళీ కడుపుతో వ్యాయామం చేయవచ్చని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. కానీ ఖాళీ కడుపుతో వ్యాయామం చేయడం వల్ల శరీరంలోని అన్ని శక్తులు, సహనం తగ్గవచ్చు. రక్తంలో చక్కెర స్థాయి తగ్గడం వల్ల తల తిరగడం, వికారం, ఆందోళన, వణుకు వంటివి రావచ్చు. ముఖ్యంగా శరీరం కొవ్వును బర్న్ చేసే బదులు నిల్వ కూడా చేయవచ్చట.

55
వ్యాయామానికి ముందు ఏ ఆహారం తినవచ్చు?

వ్యాయామం చేసే ముందు మితమైన ఆహారాలు తినవచ్చు. కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులు ఉండి సులభంగా జీర్ణమయ్యే ఆహారం తినవచ్చు. అరటిపండు, పండ్ల రసం, పెరుగుతో కూరగాయలు కలిపిన సలాడ్, ఇడ్లీ వంటి జీర్ణం కావడానికి సులభమైన ఆహారాలు మితంగా తినవచ్చు. వ్యాయామం చేయడానికి సిద్ధమైతే 2 నుంచి 3 గంటల ముందు తినండి. వ్యాయామం చేసే ముందు, చేసిన తర్వాత బాగా నీరు తాగండి. ఎలక్ట్రోలైట్ పానీయాలు, పండ్ల రసం తాగి శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోండి.

Read more Photos on
click me!

Recommended Stories