Fingers Health: మీరు కూడా వేళ్లను టిక్ అనిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు తప్పవు

Published : Feb 19, 2025, 04:56 PM ISTUpdated : Feb 19, 2025, 05:05 PM IST

Fingers Health: వేళ్ల(ఫింగర్స్)ను లాగినప్పుడు, నొక్కినప్పుడు టిక్ అని శబ్దం వస్తుంది కదా.. చాలా ప్రాంతాల్లో ఇలా చేయడాన్ని ‘వేళ్లు విరగ్గొట్టడం’ అంటారు. మీకు కూడా ఈ అలవాటు ఉందా? ఇలా చేయడం ఆరోగ్యానికి మంచిదా? కాదా? ఇప్పుడు తెలుసుకుందాం.    

PREV
15
Fingers Health: మీరు కూడా వేళ్లను టిక్ అనిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు తప్పవు

కొంతమంది తరచుగా చేతులు, కాలి వేళ్ళను విరుస్తుంటారు. దీంతో టిక్ అనే శబ్దం కూడా వస్తుంది. ఇది చాలామందికి అలవాటుగా ఉంటుంది. ఖాళీగా ఉన్నప్పుడు లేదా బాగా టెన్షన్ లో ఉన్నప్పుడు ఇలా వేళ్లు విరుస్తుంటారు. ఎవరైనా ఇలా వేళ్లు విరుస్తుంటే పెద్దవాళ్లు తిట్టేవారు. పనేం లేదా వేళ్లు విరుచుకుంటూ కూర్చున్నావ్ అంటారు. దీని వెనుక చాలా పెద్ద విషయమే ఉంది. అందుకే పూర్వం పెద్దలు ఇలాంటి పనులు చేయకుండా ఆపేవారు. అయితే వేళ్లు విరవడం వెనుక కారణం తెలియక చాలామంది దీన్ని ఒక అలవాటుగా మార్చుకుంటారు. ఇలా చేయడం ఆరోగ్యానికి ఎందుకు మంచిది కాదో ఇప్పుడు తెలుసుకుందాం. 

 

25

సాధారణంగా వేళ్లు విరవడం వల్ల బబుల్ పేలినట్టు చిన్న సౌండ్ వస్తుంది. దీని వల్ల అలసట తగ్గుతుందని అందరూ అనుకుంటారు. ఇలా అప్పుడప్పుడు చేయడం వల్ల పెద్ద ఇబ్బందులు ఏమీ రావు కాని.. అలవాటుగా మారితే కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయని డాక్టర్లు చెబుతున్నారు. 

మన చేతులు, కాలి వేళ్లలో జాయింట్స్ ఉంటాయి. ఇలా తరచూ వాటిని టిక్ అనిపించడం వల్ల అవి బలహీనపడతాయి. దీనివల్ల వాటి ఆకారం మారే అవకాశం కూడా ఉంటుంది. 

35

శబ్దం రావడానికి కారణం?

మన చేతులు, కాళ్ళలోని కీళ్ల(జాయింట్స్)లో సైనోవియల్ ద్రవం ఉంటుంది. ఇది కనెక్టివ్ టిష్యూ లాగా పనిచేస్తుంది. ఇది వేళ్లు, మోకాళ్ళు, మోచేతులలో ఉండే కీళ్ళను, ఎముకలను కలిపి ఉంచుతుంది. ఈ లిక్విడ్ జాయింట్స్ మధ్య లూబ్రికెంట్ లాగా పనిచేస్తుంది. ఒకదానికొకటి రాసుకోకుండా నిరోధిస్తుంది.

ఈ జాయింట్స్ మధ్య లోని వాయువు వేళ్ళ మధ్య ఖాళీని సృష్టిస్తుంది. దీనివల్ల అక్కడ గాలి బుడగ ఏర్పడుతుంది. అందువల్ల వేళ్లను నొక్కినప్పుడు లేదా లాగినప్పుడు ఆ గాలి బుడగలు పేలి టిక్ అన్న శబ్దం వస్తుంది.

45

ఎముకలు విరిగే ప్రమాదం

ఇలా కాళ్లు, చేతుల వేళ్లను తరచుగా టిక్ టిక్ అనిపిస్తే కీళ్లనొప్పులు వచ్చే అవకాశం ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. ఇప్పటికే కీళ్లనొప్పులు ఉన్నవారు వేళ్లను అస్సలు విరవకూడదట. 

చిన్న పిల్లలు ఇలా చేస్తే జాయింట్స్ లో ఉండే మృదు కణజాలం బలహీనపడుతుంది. అలవాటుగా రోజూ చేస్తే ఎముకలు వంకర తిరిగే అవకాశాలు కూడా ఉంటాయి. చిన్న పిల్లల వేళ్లు సున్నితంగా ఉంటాయి కనుక ఒక్కోసారి ఎముకలు విరిగే ప్రమాదం కూడా ఉంటుంది. 

55

అలవాటు మానుకోవాలి

వయసు పెరిగే కొద్దీ ఎముకలు బలహీనపడతాయి. అందుకే వేళ్లు విరిచే అలవాటు మానుకోవాలి. దాదాపు 40 నుండి 50 ఏళ్ల వయస్సు ఉన్నవారు తప్పనిసరిగా నడక వంటి తేలికపాటి వ్యాయామాలు చేయాలి. ఎక్కువ వ్యాయామం చేయడం కూడా ఎముకలను దెబ్బతీస్తుంది. మీ శరీర బరువుకు అనుగుణంగా తేలికపాటి వ్యాయామాలు చేయవచ్చు. 

పరిష్కారం ఏమిటి?

ఎముకలను బలోపేతం చేయడానికి కాల్షియం అధికంగా ఉండే ఆహారాలు తినండి. 30 ఏళ్లు దాటిన వారు వీలైనప్పుడల్లా ఎముకల్లో బలం ఎంతుందో టెస్ట్ చేయించుకోండి. డాక్టర్లను సంప్రదించి మీ శరీరానికి తగిన ఎక్సర్ సైజ్, ఆహారపు అలవాట్లను తెలుసుకొని పాటించండి. దీనివల్ల పెద్ద వ్యాధుల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు.

click me!

Recommended Stories