ముందుగా లీటర్ నీటిని వేడి చేసి అందులో అజ్వైన్, జీరా, సోంపు, మిరియాలు వేసి బాగా మరిగించాలి. దాదాపు 5 నుంచి 7 నిమిషాల వరకు మరిగించాలి. ఆ తర్వాత ఆ నీటిని వడగట్టాలి. ఇక ఒకేసారి 200 మిల్లీ లీటర్ల నీటిని తాగడం వల్ల గ్యాస్, మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు.