కవల పిల్లలు ఏలాంటి దంపతులకు పుడతారు.. కడుపులో ఉన్నప్పుడు ఉండే లక్షణాలు ఏంటి?

Sreeharsha Gopagani   | Asianet News
Published : Oct 03, 2021, 03:56 PM IST

ఒక బిడ్డకు జన్మనివ్వడం అంటే ఏ స్త్రీకైనా గొప్ప వరం అనే చెప్పాలి. ఇక ఇద్దరు పిల్లలకు ఒకేసారి జన్మనివ్వాలి అంటే అదృష్టమనే చెప్పాలి. కవల పిల్లలు పుట్టడం చాలా అరుదు.

PREV
18
కవల పిల్లలు ఏలాంటి దంపతులకు పుడతారు.. కడుపులో ఉన్నప్పుడు ఉండే లక్షణాలు ఏంటి?

ఒక బిడ్డకు జన్మనివ్వడం అంటే ఏ స్త్రీకైనా గొప్ప వరం అనే చెప్పాలి. ఇక ఇద్దరు పిల్లలకు ఒకేసారి జన్మనివ్వాలి అంటే అదృష్టమనే చెప్పాలి. కవల పిల్లలు పుట్టడం చాలా అరుదు. కొన్నిసార్లు ముగ్గురు పిల్లలు పుట్టే అవకాశం కూడా ఉంటుంది. అలా కవల పిల్లలు కూడా ఎలాంటి దంపతులకు పుడతారు.. వారు కడుపులో ఉన్నప్పుడు ఎటువంటి లక్షణాలు ఉంటాయో తెలుసుకుందాం.
 

28

మామూలుగా ఆడవారి నుంచి విడుదలైన అండం మగవారి నుంచి విడుదలైన శుక్రకణం ఫలదీకరణం చెందితే పిండంగా మారుతుందన్న విషయం తెలిసిందే. ఇక కొన్నికొన్ని సమయంలో ఆడవాళ్లకు నెలకు రెండు అండాలు కూడా విడుదలవుతుంటాయి. ఆ సమయంలో శుక్రకణాలతో ఆ రెండు అండాలు ఫలదీకరణం చెందిన వల్ల కవల పిల్లలు పుడతారు.
 

38

చాలావరకూ కొందరు ఒకే పోలికలతో పుడితే మరికొందరు వేర్వేరు పోలికలతో పుడతారు. దానికి కారణం రెండు వేరు వేరు అండాల ద్వారా ఏర్పడిన పిండాలకు ఒకే రూపం చాలా తక్కువగా ఉంటుంది. ఇక ఒక అండం ఫలదీకరణం చెందిన తర్వాత రెండు భాగాలుగా విడిపోవడంతో ఆ సమయంలో ఒకే రూపంతో పిల్లలు పుడతారు.
 

48

ఇక కవలలు ఎటువంటి దంపతులకు పుడతారు అంటే.. మామూలుగా కుటుంబంలో ఇదివరకు ఎవరికైనా కవలలు పుడితే మళ్లీ కొన్ని తరాల తరువాత కవలలు పుట్టే అవకాశం ఉంటుంది. ఆడవారి వయసు 35 ఏళ్లు కంటే ఎక్కువగా ఉంటే వారిలో రెండు అండాలు విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా బీఎంఐ 30 కన్నా ఎక్కువగా ఉన్నా కూడా మరియు పోలిక్ యాసిడ్ ఉత్పత్తి అయ్యే ఆడవాళ్లకు కూడా కవలలు పుట్టే చాన్స్ ఉంటుంది.
 

58

కడుపులో కవలలు ఉన్నప్పుడు కొన్ని లక్షణాలు ఉంటాయి. ముఖ్యంగా కవలలు ఉన్నప్పుడు గర్భవతి స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి. మంచి పోషకాలు ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవాలి. తగినంత నీటిని తీసుకోవాలి. ఇక శరీరంలో అలసట, తిమ్మిరి వంటివి లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. మామూలుగా ఒక బిడ్డ ఉన్నప్పుడు కొందరు అసౌకర్యంగా, బరువుగా ఫీల్ అవుతారు.
 

68

కవలలు ఉన్నప్పుడు పొట్ట రెట్టింపుగా కనిపిస్తుంది. పైగా రెండు రెట్లు త్వరగా పెరుగుతుంది. ఆ సమయంలో వెన్ను నొప్పి వంటివి కూడా వస్తుంటాయి. ఒక్కోసారి కడుపు, పొత్తికడుపులో నొప్పి కూడా వస్తుంది. కాబట్టి చాలా వరకు పనులు చేయకుండా విశ్రాంతి తీసుకోవాలి. 
 

78

ఎప్పటికప్పుడు వైద్యుడిని సంప్రదించాలి. కొన్ని కొన్ని సమయంలో ఒత్తిడిగా ఫీలవుతుంటారు. ఆ సమయంలో కుటుంబ సభ్యులు దగ్గరగా ఉండాలి. ఇక కవలలు ఉంటే త్వరగా ప్రస్తావిస్తారని వైద్యులు తెలుపుతుంటారు. కాబట్టి బరువులు వంటివి ఎత్తకూడదు. 
 

88

ముఖ్యంగా ఎటువంటి ఆందోళన చెందకుండా మనశాంతిగా ఉండాలి. కవల పిల్లలు పుట్టాక వారితో సమయం గడపాల్సి వస్తుంది. వారి ఆరోగ్య విషయంలో కొన్ని నెలల వరకు జాగ్రత్తగా ఉండాలి. ఎప్పటికప్పుడు పిల్లలను హాస్పిటల్ కి తీసుకెళ్లి చెక్ చేయిస్తూ ఉండాలి. కవల పిల్లలు ఏలాంటి దంపతులకు పుడతారు.. కడుపులో ఉన్నప్పుడు లక్షణాలు ఏలాంటి ఉంటాయంటే?

click me!

Recommended Stories