బెల్లీ ఫ్యాట్ తగ్గించాలా.. ఈ 8 స్టెప్స్ ఫాలో అవ్వండి..!

First Published | Jul 31, 2021, 1:31 PM IST

సరైన జీవన శైలి ఫాలో కాకపోవడం వల్ల.. ఈ పొట్ట దగ్గర.. నడుము చుట్టూ కొవ్వు పేరుకుపోతుంది. 

ఈ రోజుల్లో ఎక్కువ మందిని ఇబ్బందిని ఇబ్బంది పెడుతున్న సమస్యల్లో బెల్లీ ఫ్యాట్ ముందు వరసలో ఉంటుంది. బయట ఆహారాలకు అలవాటు పడి.. సరైన జీవన శైలి ఫాలో కాకపోవడం వల్ల.. ఈ పొట్ట దగ్గర.. నడుము చుట్టూ కొవ్వు పేరుకుపోతుంది. మరి దీనికి పరిష్కారమే లేదా అంటే.. ఈ కింద 8 స్టెప్స్ ఫాలో అయితే.. మీరు మీ బెల్లీ ఫ్యాట్ ని తగ్గించుకోవచ్చు.

belly fat

ముందుగా.. పంచదార ఉండే ఆహారాలు, నూనెలో వేయించిన పదార్థాలు తినడం మానేయాలి. ఇవి తగ్గిస్తే.. అదనంగా కొవ్వు వచ్చి చేరే అవకాశం ఉండదు.

కొవ్వు ఎక్కువగా ఉండే ఆహరాలకు దూరంగా ఉండాలి.
కార్బో హైడ్రేట్స్ ఎక్కువగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండాలి. మీ డైట్ లో పండ్లు, కూరగాయలను చేర్చాలి.
ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల పొట్ట సులభంగా తగ్గించవచ్చు.

fiber

గ్రీన్ టీ తాగడం వల్ల బెల్లీ ఫ్యాట్ తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుందని పరిశోధనలో తేలింది. గ్రీన్ టీలో క్యాలరీలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి పరగడుపున రోజూ గ్రీన్ తాగడం వల్ల సులభంగా కొవ్వు తగ్గించవచ్చు.
ప్రతిరోజూ నట్స్ తీసుకోవడం వల్ల కూడా బరువు సులభంగా తగ్గొచ్చట. అందుకు ప్రతిరోజూ బాదం పప్పు, వాల్ నట్స్ తీసుకోవాలి.

nuts

ఎక్కువ ఒత్తిడితో ఇబ్బందిపడేవారు.. త్వరగా లావు అవుతారట. కాబట్టి.. ఒత్తిడి తగ్గించుకునేందుకు ప్రయత్నించాలి.

stress

నిద్రకు... ఉబకాయానికి దగ్గరి సంబంధం ఉంటుంది. ఆకలిగా ఉన్నప్పుడు పడుకుందామన్నా నిద్ర పట్టదు. దీంతో.. ఆ ఆకలిపెరగడంతో.. మరింత ఎక్కువగా తినేస్తాం. ఈ క్రమంలో.. మరింత ఎక్కువ బరువు పెరుగుతాం. కాబట్టి.. రాత్రి సమయంలో ఎక్కువ కాకపోయినా.. కొంతైనా ఆహారం తీసుకోవాలి.

Sunday Sleep

Latest Videos

click me!