Health Tips: రాత్రిపూట వీటిని తింటున్నారా.. అయితే ఈ సమస్య కొని తెచ్చుకునట్లే?

Published : Aug 14, 2023, 02:40 PM IST

Health Tips: సాధారణంగా ప్రజలు పగలు పనిలో పడి సరిగ్గా భోజనం చేయరు అందుకే రాత్రి తీరిగ్గా కడుపునిండా భోజనం చేయడానికి ప్రయత్నిస్తారు. కానీ చాలా ఆహార పదార్థాలు రాత్రిపూట తినకూడదు అవేంటో చూద్దాం.  

PREV
16
Health Tips: రాత్రిపూట వీటిని తింటున్నారా.. అయితే ఈ సమస్య కొని తెచ్చుకునట్లే?

పొద్దున్నే ఆఫీసుకు వెళ్లే  హడావుడి, పని ఒత్తిడి వలన చాలామంది సరైన భోజనం చేయలేకపోతారు. అలాంటివారు రాత్రి తమకి నచ్చిన భోజనం చేయడానికి ఇష్టపడతారు కానీ చాలా ఆహార పదార్థాలు రాత్రిపూట తినకూడదు. వీటివల్ల చాలా అనారోగ్య సమస్యలు వస్తాయి.
 

26

అయితే రాత్రిపూట మనం తినకూడని ఆహారం ఏమిటో చూద్దాం. రాత్రిపూట హెవీగా ఉండే ఆహార పదార్థాలు అంటే ఫ్రైడ్ ఫుడ్స్, బర్గర్స్ ఇలా హెవీ గా ఉండే ఆహార పదార్థాలని తీసుకోవడం వలన డైజేషన్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది.
 

36

అలాగే నీటి శాతం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు కూడా తీసుకోకూడదు. అంటే పుచ్చకాయ, కీరదోస అలాంటివి. దానివల్ల పెద్ద వయసు వారు అర్ధరాత్రి పూట నిద్ర లేవాల్సి వస్తుంది. అలాగే బాగా స్పైసీగా ఉండే ఆహార పదార్థాలు కూడా రాత్రిపూట అవాయిడ్ చేయటం చాలా మంచిది.

46

ఎందుకంటే దీని వలన జీర్ణ సమస్యలు ఉత్పన్నమవుతాయి అలాగే రాత్రిళ్ళు టమాటా కూడా ఎక్కువగా తినకూడదు ఇది త్వరగా అరగదు ఇందులో ఉండే విటమిన్ సి జీర్ణం అవ్వటానికి ఎక్కువ టైం తీసుకుంటుంది. అలాగే కాఫీలు టీలు కూడా రాత్రిపూట అసలు తీసుకోకూడదు.

56

దీని ప్రభావం నిద్ర మీద పడుతుంది. అలాగే క్యాబేజీ క్యాలీఫ్లవర్ కూడా రాత్రిపూట తీసుకోకూడదు ఇందులో ఉండే అధిక ఫైబర్ త్వరగా జీర్ణం అవ్వదు దీనివలన మీకు సరైన నిద్ర ఉండదు. అలాగే సెట్ డ్రస్ జ్యూస్ పచ్చి ఉల్లిపాయలు వైట్ వైన్ టమాటో సాస్ వంటి వాటిని రాత్రి పూట తినకూడదు.

66

వీటి వలన కడుపులో యాసిడ్ ఉత్పన్నమై నిద్రకు భంగం కలుగుతుంది. కాబట్టి ఇలాంటి ఆహారం కాకుండా తేలికగా జీర్ణం అయ్యే ఆకుకూరలు లాంటి ఆహారం తీసుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం మంచి నిద్ర కూడా  పడుతుంది.

click me!

Recommended Stories