డయాబెటీస్ పేషెంట్లు చెరుకు రసం తాగకూడదా?

First Published | Nov 19, 2023, 2:43 PM IST

చెరకులో ఎన్నో రకాల పోషకాలుంటాయి. చెరుకును తిన్నా.. చెరుకు రసాన్ని తాగితే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. కానీ ఈ చెరుకు డయాబెటీస్ పేషెంట్లకు అంత మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే? 
 

Sugarcane Juice

చెరుకు రసంలో పొటాషియం, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, జింక్, మెగ్నీషియం, థయామిన్, రిబోఫ్లేవిన్ తో పాటుగా అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఒక గ్లాసు చెరకు రసంలో 180 కేలరీలు, 30 గ్రాముల చక్కెర ఉంటుంది.  దీనిలో డైటరీ ఫైబర్ కూడా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. సుక్రోజ్ లో 13-15% చక్కెర కంటెంట్ ఉంటుంది. దీనిలో 70-75 శాతం వాటర్ కంటెంట్ ఉంటుంది. ప్రాసెస్ చేయని చెరుకు రసంలో ఫినోలిక్, ఫ్లేవనాయిడ్ యాంటీఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. 

Sugarcane Juice

చెరుకులో ఉండే ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్ మొటిమలను నివారిస్తుంది. అలాగే మన చర్మాన్ని మృదువుగా చేస్తుంది. చెరుకు రసాన్ని తాగడం వల్ల మలబద్ధకం నుంచి ఉపశమనం పొందుతారు. అలాగే ఇది  సంతానోత్పత్తిని పెంచడానికి కూడా సహాయపడుతుంది. అలాగే హెవీ పీరియడ్స్ ను కూడా నియంత్రించడానికి సహాయపడతాయి. 
 

Latest Videos


sugarcane juice

చెరుకు గ్లైసెమిక్ ఇండెక్స్ 43. ఇది అంత ఎక్కువేం కాదు. ఇది సహజ భేదిమందుగా గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఎన్నో ఇతర ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగిస్తుంది. అందుకే డయాబెటిక్ పేషెంట్లు  నెలకు ఒకసారి చాలా తక్కువ మొత్తంలో ఈ రసాన్ని తాగొచ్చు. 

sugarcane juice

సుక్రోజ్ లేదా చెరుకులో ఉండే చక్కెర, గ్లూకోజ్ కారణంగా ఇన్సులిన్ స్థాయిలు పెరుగుతాయి.అందుకే డయాబెటిస్ పేషెంట్లు చెరకు రసాన్ని గానీ, చెరకు గానీ తీసుకోకూడదని నిపుణులు చెబుతారు. చెరుకు రసంలో ఫైబర్ కంటెంట్ కూడా తగ్గుతుంది. ఎందుకంటే రసం తీయేటప్పుడు ఫైబర్ బయటకు వెళ్లిపోతుంది. ఇది వెంటనే షుగర్ లెవెల్స్ ను పెంచుతుంది.  

తక్కువ జీఐ కారణంగా.. ఇది రక్తప్రవాహంలో చక్కెర శోషణ మందగించడానికి సహాయపడుతుంది. అయితే గ్లైసెమిక్ లోడ్ రక్తంలో చక్కెర పెరుగుదల మొత్తాన్ని నిర్ణయిస్తుంది. ఇది రక్తంలో చక్కెర మొత్తాన్ని పెంచుతుంది. డయాబెటిస్ ఉన్నవారు గ్లైసెమిక్ ఇండెక్స్  ఎక్కువగా ఉన్న ఆహారాలకు దూరంగా ఉండాలి. 
 

ఇతర చక్కెర పానీయాల మాదిరిగానే చెరుకు రసం కూడా మంచి ప్రత్యామ్నాయం. కానీ ఇది డయాబెటిస్ ఉన్నవారికి మంచిది కాదు. చెరుకు రసంలో ఎక్కువ చక్కెర ఉండటం వల్ల శరీర రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. అందుకే డయాబెటిస్ ఉంటే చెరుకు రసాన్ని తాగకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. 

కాలేయ సిరోసిస్ నుంచి కోలుకుంటున్న వారు చెరుకు రసాన్ని తాగొచ్చు. ఇది లివర్ సిర్రోసిస్ కు మంచిదని నిపుణులు అంటున్నారు, ఎందుకంటే ఆ సమయంలో రోగికి ఎక్కువ కేలరీలు అవసరమవుతాయి.
 

click me!