టాయిలెట్లను ఇలా గనుక ఉపయోగించారంటే మీ పని అంతే..!

First Published | Nov 19, 2023, 10:35 AM IST

world toilet day 2023: ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవాన్ని ప్రతి ఏడాది నవంబర్ 19 న జరుపుకుంటారు. మరుగుదొడ్ల పరిశుభ్రతపై జనాలకు అవగాహన కల్పించడమే ఈ రోజు ముఖ్య ఉద్దేశ్యం. మన ఇంటిని, వంటగదిని శుభ్రం చేసినట్టే మరుగుదొడ్డి పరిశుభ్రత విషయంలో కూడా పలు జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే ఇది మనల్ని ఎన్నో రోగాల బారిన పడేస్తుంది. 
 

ప్రతి ఏడాది నవంబర్ 19 న ప్రపంచ టాయిలెట్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ రోజు ప్రజలకు మరుగుదొడ్ల వినియోగం, వాటి పరిశుభ్రత ప్రాముఖ్యత గురించి తెలియజేస్తారు. మరుగుదొడ్ల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటుగా, బహిరంగ మలవిసర్జన చేయడాన్ని నిరోధించడమే ఈ రోజు ముఖ్య ఉద్దేశం. మరుగుదొడ్లను ఉపయోగించడమే కాదు.. వాటి పరిశుభ్రతను కూడా పట్టించుకోవాలి. ఎందుకంటే ఇది మనల్ని ఎన్నో రోగాల బారిన పడేస్తుంది. మరుగుదొడ్లను సరిగ్గా క్లీన్ చేయకపోతే ఎన్నో రకాల ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే  ప్రపంచ టాయిలెట్ దినోత్సవం సందర్భంగా వీటిని ఎలా పరిశుభ్రంగా ఉంచుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

టాయిలెట్ సీటు పరిశుభ్రత

మీకు తెలుసా? మనం ఉపయోగించే టాయిలెట్ సీటు చుట్టంతా లక్షలాది బ్యాక్టీరియా ఉంటుంది. నిజానికి మురికి బూట్లు, చెప్పుల వల్ల  టాయిలెట్ లో బ్యాక్టీరియా పెరుగుతుంది. అందుకే మీరు టాయిలెట్ సీటును క్లీన్ గా ఉంచండి. అలాగే టాయిలెట్ సీటును ఉపయోగించే ముందు ఆ తర్వాత టాయిలెట్ ను శానిటైజర్ తో  క్లీన్ చేయండి. 


ఫ్లష్ ఎలా చేయాలి?

క్లీన్ గా లేని మరుగుదొడ్లను వాడటం వల్ల ఎన్నో రోగాల బారిన పడుతున్నారు జనాలు. టాయిలెట్ సీట్లపై గడ్డకట్టిన బ్యాక్టీరియా ఎన్నో రకాల ఇన్ఫెక్షన్లను కలిగిస్తుంది. అందుకే = ఫ్లషింగ్ చేసేటప్పుడు మీరు కొన్ని విషయాలను మర్చిపోకూడదు. టాయిలెట్ సీట్ మూత మూసివేసిన తర్వాత ఫ్లష్ చేయాలని నిపుణులు చెబుతున్నారు.
 

టాయిలెట్ ఫ్లోర్ శుభ్రం 

టాయిలెట్ లో ఉన్న మన కంటికి కనిపించని సూక్ష్మక్రిములను తొలగించడానికి టాయిలెట్ ఫ్లోర్ ను పొడిగా ఉంచడానికి ప్రయత్నించండి. తేమ వల్ల బ్యాక్టీరియా వేగంగా వ్యాప్తి చెందుతుంది.
 

మీ చేతుల శుభ్రం 

టాయిలెట్ ను ఉపయోగించేటప్పుడు మీ చేతులకు ఎన్నో రకాల సూక్ష్మక్రిములు అంటుకుంటాయి. అందుకే టాయిలెట్ ను ఉపయోగించేటప్పుడు పరిశుభ్రతపై శ్రద్ధ వహించండి. టాయిలెట్ ను ఉపయోగించిన వెంటనే మీ చేతులను సబ్బుతో కడుక్కోవాలి. అలాగే చేతులను కడిగిన తర్వాత శుభ్రమైన టవల్స్ తో తుడిచి వాటిని ఆరబెట్టండి.
 

Latest Videos

click me!