Papaya
బొప్పాయిని తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో. బొప్పాయిలో విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ బి పుష్కలంగా ఉంటాయి. ఈ పండులో పాపైన్ అనే ఎంజైమ్ కూడా ఎక్కువ ఉంటుంది. బొప్పాయిలో ఉండే ఫైబర్స్ మలబద్దకం నుండి ఉపశమనం పొందడానికి, మరియు ప్రకోప ప్రేగు సిండ్రోమ్ ను తగ్గించడానికి సహాయపడుతుంది.
Papaya
బొప్పాయిని మీ ఆహారంలో చేర్చుకోవడం గుండె ఆరోగ్యానికి మంచిది. బొప్పాయిలో ఉండే లైకోపీన్, విటమిన్ సి, ఫైబర్ ఎల్ డీఎల్ కొలెస్ట్రాల్ అంటే చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచతాయి. బొప్పాయిలో విటమిన్ ఇ కూడా పుష్కలంగా ఉంటుంది. దీనిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్ ఆక్సీకరణను నిరోధిస్తాయి.
కొలెస్ట్రాల్ ఆక్సీకరణం చెందినప్పుడు, ఇది గుండె జబ్బులకు దారితీసే అడ్డంకులను సృష్టించే అవకాశం ఉంది. అలాగే బొప్పాయిలో పుష్కలంగా ఉండే ఫైబర్ కంటెంట్ గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. బొప్పాయిలో రెండు ఎంజైములు ఉంటాయి. పాపైన్, చిమోపాపైన్. ఈ రెండు ఎంజైములు ప్రోటీన్లను జీర్ణం చేస్తాయి. అంటే ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. అలాగే మంటను తగ్గిస్తుంది.
Papaya
తక్కువ కేలరీలు, పిండి పదార్ధాలు ఎక్కువగా ఉండే బొప్పాయి ఆకలిని తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. అలాగే ఈ పండు బరువు తగ్గేందుకు కూడా సహాయపడుతుంది. బొప్పాయిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ పండు బరువు తగ్గడానికి బాగా ఉపయోగపడుతుంది.
Papaya
బొప్పాయి పండు మాత్రమే కాదు బొప్పాయి విత్తనాలు కూడా మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఎంతో మేలు చేస్తాయి. ఎందుకంటే దీనిలో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉండదు. ఇది రక్తంలో చక్కెర పెరుగుదలను నియంత్రిస్తుంది.
papaya
బొప్పాయిలో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఫైబర్స్ శరీరం నుంచి విషాన్ని సమర్థవంతంగా తొలగించడానికి సహాయపడతాయి. విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.ఇది బ్యాక్టీరియా, వైరల్ వ్యాధులతో పోరాడటానికి సహాయపడుతుంది.