ఉదయం లేవగానే ఫోన్ చూసే అలవాటుందా? అయితే మీకు ఈ రోగాలు రావడం ఖాయం..!

First Published | Aug 27, 2023, 10:31 AM IST

పొద్దు పొద్దున్నే ఫోన్ చూసే అలవాటు చాలా మందికే ఉంటుంది. కానీ ఈ అలవాటు మీ కళ్లకు అస్సలు మంచిది కాదు. ఇది ఎన్నో కళ్ల సమస్యలను కలిగిస్తుంది. 
 

మొబైల్ మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగమైపోయింది. దీన్ని చూడకుండా క్షణం పాటు కూడా ఉండలేని వారు కూడా ఉన్నారు.  నిద్రపోయేటప్పుడు, లేచిన తర్వాత, తినేటప్పుడు, స్నానం చేసేటప్పుడు, పనిచేసేటప్పుడు కూడా ఫోన్ ను చూస్తుంటారు. కొద్దిసేపు పక్కన పెట్టారో లేదో.. మళ్లీ ఏదైనా నోటిఫికేషన్ వచ్చిందేమోనని చెక్ చేస్తుంటారు. కానీ మితిమీరిన మొబైల్ ఫోన్ వాడకం మీ ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ముఖ్యంగా పొద్దు పొద్దున్నే ఫోన్ చూసే అలవాటు కళ్లకు అసలే మంచిది కాదు. దీనివల్ల కళ్లకు సంబంధించిన ఎన్నో రకాల సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. 
 

ఐడీసీ రీసెర్చ్ నివేదిక ప్రకారం.. స్మార్ట్ ఫోన్ ను వాడే 80 శాతం మంది నిద్ర లేచిన 15 నిమిషాల్లోనే తమ మొబైల్ ఫోన్లను చెక్ చేసుకుంటున్నారు. ఇది మీ కళ్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. మొబైల్ నుంచి వెలువడే బ్లూ లైట్ కళ్లను ఎలా దెబ్బతీస్తుందో ఈ పరిశోధన వెళ్లడించింది. 

Latest Videos


స్క్రీన్ నుంచి వచ్చే బ్లూ లైట్ అంత మంచిది కాదు. అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆప్తాల్మాలజీ ప్రకారం.. ఫోన్ నుంచి వచ్చే బ్లూలైట్ కంటి ఒత్తిడిని కలిగిస్తుంది. అలాగే రెటీనాను దెబ్బతీస్తుంది. దీనికితోడు వయసుతో పాటు వచ్చే మాక్యులర్ డీజెనరేషన్ సమస్య వచ్చేలా కూడా చేస్తుంది. ఎక్కువ సేపు స్క్రీన్ వైపు చూస్తే కళ్లకు సంబంధించిన సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. అలా కాకుండా కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే ఏదైనా చూసేటప్పుడు నిమిషానికి కనీసం 15 సార్లు కళ్లను ఆర్పాలి. 
 

mobile phone

కళ్లపై ఒత్తిడి పెరిగితే 

కళ్లలో వాపు, నొప్పి

కళ్ల అలసట, పొడిబారడం వల్ల దురద సమస్యలు పెరుగుతాయి

సోమరితనం 

జర్నల్ ఆఫ్ న్యూరల్ ట్రాన్స్మిషన్ 2007 లో ఒక నివేదిక ప్రకారం.. ఉదయం నీలి కాంతికి గురికావడం వల్ల శరీరంలో మెలటోనిన్ స్థాయి పెరుగుతుంది. మెలటోనిన్ మీ నిద్ర చక్రాన్ని నియంత్రించే హార్మోన్. శరీరంలో ఈ హార్మోన్ స్థాయి పెరగడం వల్ల నిద్రమత్తుగా ఉంటుంది. అంటే మీ శరీరం బద్ధకంగా అనిపిస్తుంది. 
 

నిద్రకు భంగం 

అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆప్తాల్మాలజీ పరిశోధన ప్రకారం. మీరు నిద్రపోయే ముందు ఏదైనా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ ను ఉపయోగిస్తే.. మీ జీవ గడియారం మారుతుంది. నిజానికి రెటీనాలోని ఫోటోరిసెప్టర్ కణాల నుంచి బ్లూ లైట్ గ్రహించబడుతుంది. ఇది మిమ్మల్నికంటి నిండా నిద్రపోనివ్వదు.
 

యాంగ్జైటీ 

ఉదయం నిద్రలేవగానే ఫోన్ చెక్ చేయడం మొదలుపెట్టడం వల్ల మీకు ఒత్తిడి, యాంగ్జైటీ కలుగుతుంది. నిజానికి మెసేజెస్, ఈ-మెయిల్స్, నోటిఫికేషన్ రకాలు ఒకేసారి మీ యాంగ్జైటీకి కారణమవుతాయి. మానసిక ఒత్తిడితో రోజును ప్రారంభిస్తే రోజంతా మీరు ఒత్తిడికి లోనవుతారు. ఒక వైపు మొబైల్ నుంచి వెలువడే బ్లూ లైట్ మీ రెటీనాను దెబ్బతీస్తే.. మరోవైపు ఆందోళన కూడా మీ సమస్యను పెంచుతుంది.
 

పొడి కళ్లు 

మొబైల్ ఫోన్ స్క్రీన్ చూడటం వల్ల కళ్లు పొడిబారుతాయి. దీంతోపాటు కంటిచూపు కూడా దెబ్బతింటుంది. ఇది కళ్లలో మాక్యులర్ క్షీణత ప్రమాదాన్ని పెంచుతుంది. అలాగే వయస్సుతో పాటు క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకోవడం చాలా ముఖ్యం.
 

eye health

ఈ సమస్య రాకుండా ఉండటానికి చిట్కాలు 

మార్నింగ్ వాక్ లేదా యోగాతో రోజును స్టార్ట్ చేయండి. 

బయటకు వెళ్లే ముందు సన్ గ్లాసెస్ పెట్టుకోవడం మర్చిపోవద్దు.

ఉదయాన్నే నిద్రలేచి కాసేపు ఏదైనా పుస్తకం లేదా వార్తాపత్రికను చదవండి.

ఉదయపు ఎండలో 10 నుంచి 15 నిమిషాలు కూర్చోండి.

click me!