కళ్ళ కింద నల్లటి వలయాలతో బాధపడుతున్నారా.. చింతపండుతో ఇలా చేస్తే అందమే అందం?

Published : Oct 05, 2022, 01:57 PM IST

అందంగా ఉండాలని ఎవరైతే కోరుకోరు చెప్పండి. ఆడవాళ్లు మగవాళ్ళు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఎంతో అందంగా కనిపించాలని కోరుకుంటారు. ఈ క్రమంలోనే వారి అందాన్ని రెట్టింపు చేసుకోవడం కోసం మార్కెట్లో దొరికే ఎన్నో సౌందర్య ఉత్పత్తులను ఉపయోగిస్తుంటారు. అయితే కొంతమంది మాత్రం కళ్ళ కింద నల్లటి వలయాలతో ఎంతో ఇబ్బందులు పడుతుంటారు. మరి ఈ వలయాలు తొలగిపోవాలంటే ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే చాలు...  

PREV
14
కళ్ళ కింద నల్లటి వలయాలతో బాధపడుతున్నారా.. చింతపండుతో ఇలా చేస్తే అందమే అందం?

అమ్మాయిలు లేదా అబ్బాయిలు అందంగా కనపడాలంటే ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే కొందరికి మాత్రం కళ్ళ కింద నల్లటి వలయాలు ఏర్పడి అందవిహీనంగా కనిపిస్తూ ఉంటారు. ఈ నల్లటి వలయాలు కొన్ని కారణాల వల్ల ఏర్పడుతుంటాయి అధిక ఒత్తిడికి గురవడం, సరైన నిద్ర లేకపోవడం, ఇతర కారణాలవల్ల ఇలా కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడుతుంటాయి.
 

24

ఈ విధంగా ఏర్పడిన నల్లటి వలయాల వల్ల చాలామందికి అందవిహీనంగా ఉంటుంది. అయితే ఈ నల్లటి వలయాలను తొలగించుకోవడం కోసం ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ పెద్దగా ఫలితాలు ఉండవు.ఎవరైతే ఈ విధంగా నల్లటి వలయాలతో బాధపడుతూ ఉంటారో అలాంటి వాళ్ళు సహజ సిద్ధంగా ఈ నల్లటి వలయాలను తొలగించుకోవడానికి ఈ సింపుల్ చిట్కాను పాటిస్తే చాలు నల్లటి వలయాలు తొలగిపోయి అందమైన మొహం మీ సొంతం అవుతుంది.
 

34

మన ఇంట్లో ప్రతి ఒక్కరు ఉపయోగించే చింతపండుతో ఈ నల్లటి వలయాలకు చెక్ పెట్టవచ్చు.సిట్రిక్ యాసిడ్ గుణాలు కలిగినటువంటి చింతపండు కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందాన్ని పెంపొందించుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. మన చర్మం ఎంతో ప్రకాశవంతంగా నిగనిగలాడాలంటే చింతపండును కాసేపు నీళ్లలో నానబెట్టి ఆ రసంతో మొహంపై బాగా మర్దన చేసుకుని కొన్ని నిమిషాల తర్వాత చల్లని నీటితో మొహన్ని శుభ్రం చేసుకుంటే మన మొహం ఎంతో ప్రకాశవంతంగా ఉంటుంది.
 

44

అదేవిధంగా చింతపండు, పాలు మిక్సీలో వేసి మిశ్రమంలా తయారు చేసుకోవాలి. ఇలా తయారైన మిశ్రమాన్ని ఫేస్ ప్యాక్ లా వేసుకొని అరగంట తర్వాత చల్లని నీటితో శుభ్రంగా కడగాలి. ఇలా వారానికి రెండు రోజులపాటు చేయటం వల్ల మొహంపై ఏర్పడినటువంటి నల్లటి మచ్చలు తొలగిపోవడమే కాకుండా ముఖంపై ముడతలు కూడా తగ్గి యవ్వనంగా కనపడతారు. మరింకెందుకు ఆలస్యం వెంటనే ఈ చిట్కాతో మీ అందాన్ని రెట్టింపు చేసుకోండి.

click me!

Recommended Stories