వెనక్కి నడవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు:
మోకాళ్ల నొప్పులు తగ్గిపోతాయి:
ఒక వయసు వచ్చిన తర్వాత మోకాళ్ల నొప్పులు రావడం చాలా సహజం. కానీ ఈ మోకాళ్ల నొప్పుల వల్ల నడవడమే కాదు.. కూర్చోవడం, పడుకోవడం కూడా కష్టంగా ఉంటుంది. అయితే మీరు రోజూ కాసేపు ముందుకి కాకుండా వెనక్కి నడిస్తే గనుక మోకాళ్ల నొప్పులు చాలా వరకు దూరమవుతాయి.
వెనక్కి నడవడం వల్ల మోకాళ్ల వాపు, నొప్పి వంటి సమస్యలు తగ్గిపోతాయని పరిశోధనలు కనుగొన్నాయి. కాళ్లకు గాయలు లేదా కీళ్లవాతం ఉన్నవారు ఇలా వెనక్కి నడిస్తే మంచి జరుగుతుందని పరిశోధకులు వెల్లడిస్తున్నారు.
నడుము నొప్పి తగ్గుతుంది:
నడుము నొప్పి చిన్న సమస్య అయితే కాదు. దీనివల్ల ఎంతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. అయితే నడుము నొప్పితో బాధపడేవారికి కూడా రివర్స్ వాకింగ్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రోజూ కొన్ని నిమిషాలు వెనక్కి నడిస్తే నడుము నొప్పి నుంచి మంచి ఉపశమనం కలుగుతుంది. ఇది నడుము కండరాలకు మంచి వ్యాయామం కూడా అవుతుంది. వెనక్కి నడవడం వల్ల వెన్నెముకకు తక్షణ ఉపశమనం అందుతుంది.