చియా సీట్ వాటర్
బెల్లీ ఫ్యాట్ ను కరిగింంచడానికి చియా సీడ్స్ బాగా ఉపయోగపడతాయి. చియా విత్తనాల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ బేబీ సీడ్ లో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలతో సహా ప్రోటీన్లు, ఖనిజాలు కూడా ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఫైబర్, క్యాల్షియం, జింక్, ఐరన్, ఇతర యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండే ఈ గింజలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ ఎక్కువగా ఉండే చియా సీడ్ వాటర్ జీర్ణక్రియకు సహాయపడుతుంది. దీనిలోని ఫైబర్ కంటెంట్ పుష్కలంగా కడుపును తొందరగా నింపడానికి సహాయపడుతుంది. దీంతో మీరు సులువుగా బరువు తగ్గుతారు. ఈ గింజలు పొట్టను తగ్గించడానికి కూడా సహాయపడతాయి. దీని కోసం రెండు టేబుల్ స్పూన్ల చియా విత్తనాలను నీటిలో కలపండి. అందులో కొన్ని చుక్కల నిమ్మరసాన్ని కలపాలి. ఈ నీటిని ప్రతిరోజూ ఉదయం పరగడుపున తాగండి. ఈ డ్రింక్ బెల్లీ ఫ్యాట్ ను కరిగించడానికి సహాయపడుతుంది.