వీటిని అతిగా తింటే మీ ఇమ్యూనిటీ పవర్ తగ్గుతుంది జాగ్రత్త..

Published : Jul 11, 2023, 03:48 PM IST

వ్యాధులకు దూరంగా ఉండటానికి మన రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉండాలి. మన ఇమ్యూనిటీ పవర్ ను బలోపేతం చేయడంలో ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. అయితే కొన్ని ఆహారాలు మాత్రం ఇమ్యూనిటీని తగ్గిస్తాయి. 

PREV
19
వీటిని అతిగా తింటే మీ ఇమ్యూనిటీ పవర్ తగ్గుతుంది జాగ్రత్త..

టీ, కాఫీ, మిల్క్ షేక్ లేదా ఏ సమ్మర్ డ్రింక్ అయినా సరే మనం ప్రతిరోజూ కొన్ని చెంచాల చక్కెరను కచ్చితంగా తింటాం. ఈ పానీయాలు మనల్ని చల్లబరచడానికి లేదా ఉత్సాహంగా ఉంచడానికి, మనకు శక్తినివ్వడానికి సహాయపడతాయి. అయితే ఈ పానీయాలలో ఉండే చక్కెర మన రోగనిరోధక శక్తిని ప్రభావితం చేస్తుందన్న ముచ్చట మీకు తెలుసా? నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం.. తెల్ల రక్త కణాలు చెడు బ్యాక్టీరియా లేదా వైరస్ ను నాశనం చేయలేకపోవడం వల్ల చక్కెర రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది.
 

29


రోగనిరోధక శక్తిని బలహీనపరిచే ఆహారాలు

మీరు ఆరోగ్యంగా ఉండాలనుకుంటే మన రోగనిరోధక శక్తి బలంగా ఉండాలి. బ్యాక్టీరియా, పరాన్నజీవులు, వైరస్ ల వల్ల కలిగే అంటువ్యాధుల నుంచచి రక్షించడానికి ఇది సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వివిధ హానికరమైన వ్యాధులను ఎదుర్కోవటానికి ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థ చాలా అవసరం. కొన్ని ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి తగ్గుతుంది. అవేంటేంటంటే.. 
 

39
sugar

చక్కెర

చక్కెరను ఎక్కువగా తీసుకోవడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఇది మన బరువును పెంచడమే కాకుండా మన రోగనిరోధక వ్యవస్థ పనితీరును కూడా దెబ్బతీస్తుంది. ముఖ్యంగా బ్యాక్టీరియా, వైరస్లతో పోరాడటానికి తెల్ల రక్త కణాల చర్యను నెమ్మదిస్తుందని నిపుణులు చెబుతున్నారు. 

49

ప్రాసెస్ చేసిన ఆహారాలు

ప్రాసెస్ చేసిన ఆహారాల్లో సోడియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు వీటిలో అనారోగ్యకరమైన కొవ్వు కూడా ఉంటుంది. అలాగే దీర్ఘకాలిక మంటకు దారితీసే కృత్రిమ సంరక్షణకారులు కకూడా ఉంటాయి. ఇవి మన  ఆరోగ్యాన్ని పాడుచేయడమే కాకుండా మన రోగనిరోధక శక్తిని కూడా బలహీనపరుస్తాయి.
 

59
alcoholic

ఆల్కహాల్

ప్రతి రోజూ రాత్రి పూట ఆల్కహాల్ ను తాగేవారున్నారు. కానీ ఇది మీ ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. మందును ఎక్కువగా తాగడం వల్ల రోగనిరోధక పనితీరు తగ్గుతుంది. ఇది అంటువ్యాధులకు దారితీస్తుంది. ఇది అంటువ్యాధులతో పోరాడే మీ శరీర సామర్థ్యాన్ని కూడా తగ్గిస్తుంది. 

69

వేయించిన ఆహారాలు

వేయించిన ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల రోగనిరోధక వ్యవస్థ పనితీరు దెబ్బతింటుంది. ఇది ఆక్సీకరణ ఒత్తిడి, దీర్ఘకాలిక మంటకు దారితీస్తుంది. అందుకే ఇలాంటి ఆహారాలను తినకండి.
 

79

ట్రాన్స్ ఫ్యాట్స్

ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్, కాల్చిన ఆహారాల్లో ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ ఫుడ్ మన రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది. ఎన్నో అంటువ్యాధులకు కారణమవుతుంది.
 

89

అధిక సోడియం ఆహారాలు

సోడియం ఎక్కువగా ఉన్న ఆహారాలు, పానీయాలు రక్తపోటును అమాంతం పెంచుతాయి. అలాగే మీ రోగనిరోధక శక్తి కూడా బాగా బలహీనపడుతుంది. 
 

99

అధిక శుద్ధి చేసిన ధాన్యాలు

శుద్ధి చేసిన ధాన్యాల్లో పోషకాలు, ఫైబర్ కంటెంట్ తక్కువగా ఉంటాయి. ఇవి రోగనిరోధక వ్యవస్థకు ముఖ్యమైన గట్ మైక్రోబయాలో అసమతుల్యతకు దారితీస్తాయి.

కెఫిన్

మీ శరీరంలో కెఫిన్ కంటెంట్ ను ఎక్కువగా తీసుకుంటే మీ నిద్ర ప్రభావితం అవుతుంది. కెఫిన్ కంటెంట్ నిద్రలేకుండా చేస్తుంది. కాబట్టి ఇది రోగనిరోధక శక్తిని ప్రభావితం చేస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories