క్యాన్సర్ నుంచి గుండె జబ్బుల వరకు.. వెల్లుల్లి ఎన్ని రోగాల రిస్క్ ను తగ్గిస్తుందో తెలుసా?

Published : Jul 11, 2023, 04:29 PM IST

నిజానికి వెల్లుల్లి మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజకరంగా ఉంటుంది. ఇది ఎన్నో రోగాల ముప్పును కూడా తగ్గిస్తుంది. అందుకే దీన్ని రెగ్యులర్ గా తినాలంటరు ఆరోగ్య నిపుణులు.   

PREV
16
క్యాన్సర్ నుంచి గుండె జబ్బుల వరకు.. వెల్లుల్లి ఎన్ని రోగాల రిస్క్ ను తగ్గిస్తుందో తెలుసా?

ఘాటైన వెల్లుల్లి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఆరోగ్యాన్ని పెంచే సమ్మేళనాల శక్తివంతమైన మూలం వెల్లుల్లి. వెల్లుల్లి మన రోగనిరోధక శక్తిని పెంచడం నుంచి గుండెను ఆరోగ్యంగా ఉంచడం. శరీరంలో మంటను తగ్గించడం వరకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది.  అసలు వెల్లుల్లిని తింటే ఎలాంటి రోగాల ముప్పు తగ్గుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..
 

26
garlic

క్యాన్సర్ ను నివారిస్తుంది

వెల్లుల్లిని తినడం వల్ల కొన్ని రకాల క్యాన్సర్ల ముప్పు తగ్గుతుంది. ముఖ్యంగా జీర్ణవ్యవస్థను ప్రభావితం చేసే క్యార్సర్ లకు వ్యతిరేకంగా రక్షణ ప్రభావాన్ని చూపుతుందని అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి. వెల్లుల్లిలోని ఆర్గానోసల్ఫర్ సమ్మేళనాలు క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తాయని అధ్యయనం వెల్లడిస్తోంది. 
 

36

ఆరోగ్యకరమైన గుండె

వెల్లుల్లి గుండె ఆరోగ్యంపై సానుకూల ప్రభావాలను చూపుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది రక్తపోటును తగ్గించడానికి, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి, రక్త ప్రసరణను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. వెల్లుల్లిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. అలాగే గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది. 
 

46

రోగనిరోధక శక్తి

వెల్లుల్లిలో రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది అనారోగ్యాలకు వ్యతిరేకంగా మన శరీరం రక్షణ వ్యవస్థను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. అల్లిసిన్ వంటి దాని క్రియాశీల సమ్మేళనాలు యాంటీమైక్రోబయల్, యాంటీవైరల్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి జలుబు, ఫ్లూ వంటి సాధారణ ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడతాయి.
 

56

యాంటీ ఆక్సిడెంట్లు

వెల్లుల్లిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే ఆక్సీకరణ నష్టం నుంచి శరీరాన్ని రక్షించడానికి సహాయపడతాయి. సెల్యులార్ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో, దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడానికి, ఆరోగ్యకరమైన వృద్ధాప్యానికి మద్దతు ఇవ్వడానికి యాంటీఆక్సిడెంట్లు కీలక పాత్ర పోషిస్తాయి.
 

66

యాంటీ ఇన్ఫ్లమేషన్

వెల్లుల్లిలో కనిపించే సల్ఫర్ సమ్మేళనాలు శోథ నిరోధక లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి శరీరంలో మంటను తగ్గించడంలో సహాయపడతాయి. దీర్ఘకాలిక మంట వివిధ వ్యాధులను కలిగిస్తుంది. కాబట్టి వెల్లుల్లిని తింటే మొత్తం మంట తగ్గుతుంది.

click me!

Recommended Stories