నీళ్లు ఎన్నో రోగాల రిస్క్ ను తగ్గిస్తయ్.. మరి నీళ్లను ఎప్పుడెప్పుడు ఎంత తాగాలో తెలుసా?

First Published | Sep 29, 2023, 7:15 AM IST

నీళ్లు మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. కానీ కొన్ని సమయాల్లో నీళ్లను అస్సలు తాగకూడదు. ఇంకొన్ని సమయాల్లో నీళ్లను ఖచ్చితంగా తాగాలి. టైం ప్రకారం.. ఈ రెండు పనులను చేయకపోవడం వల్ల తిన్నది అరగకపోవడమే కాకుండా ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. 

నీళ్లను తాగడం వల్ల మన శరీరం హైడ్రేట్ గా ఉంటుంది. అలాగే ఎన్నో రోగాల ముప్పు కూడా తప్పుతుందని వినే ఉంటారు. అందుకే డాక్టర్లు నీటిని పుష్కలంగా తాగాలని చెప్తుంటారు. నిజానికి వాటర్ మనల్ని ఎన్నో వ్యాధుల నుంచి రక్షించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. అయితే నీళ్లను కూడా సరైన సమయంలోనే తాగాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తప్పుడు సమయంలో నీళ్లను తాగడం వల్ల ప్రయోజనం కంటే నష్టాలే కలుగుతాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
 


సరైన మోతాదులో నీటిని తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు

శారీరక శక్తి 

నీటిని పుష్కలంగా తాగడం వల్ల మన శరీర శక్తి స్థాయిలు ఏ మాత్రం తగ్గవు. ఇది మనల్ని రోజంతా చురుగ్గా ఉంచుతుంది. అలాగే ఎన్నో రోగాలతో పోరాడే సామర్థ్యం కూడా పెరుగుతుంది. 

టాక్సిన్స్ బయటకు 

నీటిని తాగడం వల్ల మన శరీరం లోపల ఉండే టాక్సిన్స్ బయటకు వెళ్లిపోతాయి. దీంతో మన శరీరం శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంటుంది. తద్వార వ్యాధులకు వ్యతిరేకంగా మన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. 
 


చికిత్సలో సహాయపడుతుంది

నీటిని పుష్కలంగా తాగడం వల్ల మూత్ర సమస్యలు, మూత్రపిండాల్లో రాళ్లు,  జీర్ణ సమస్యలు వంటి ఎన్నో రోగాలు తొందరగా తగ్గిపోతాయి. దీంతో మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. 

జుట్టు, చర్మం, కళ్ల ఆరోగ్యం

నీళ్లను తాగడం వల్ల మన చర్మం, జుట్టు, కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. నీరు మన చర్మాన్ని తేమగా, కాంతివంతంగా చేస్తుంది. అలాగే సహజమైన పద్ధతిలో కళ్లను రిలాక్స్ చేస్తుంది.
 

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది

నీటిని పుష్కలంగా తాగడం వల్ల ఎన్నో జీర్ణ సమస్యలు తగ్గిపోతాయి.  నీరు మన జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇది మీ శరీరాన్ని పోషిస్తుంది. అలాగే మనం తినే ఆహారం తొందరగా అరిగేందుకు సహాయపడుతుంది. 
 

నీటిని ఏయే సమయాల్లో తాగాలి? 

ఉదయాన్నే.. 

ఉదయం నిద్రలేవగానే నీటిని తాగడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. నిజానికి ఇది నీళ్లు తాగడానికి ఉత్తమ సమయం కూడా. ఎందుకంటే మీరు రాత్రంతా నీళ్లను తాగరు. దీనివల్ల శరీరం బాగా డీహైడ్రేట్ అవుతుంది. ఇలాంటి సమయంలో మీరు ఉదయం లేచిన వెంటనే ఒక గ్లాస్ నీటిని తాగితే ఎణ్నో రెట్లు మీ ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఆరోగ్యాన్ని మరింత మెరుగ్గా ఉంచడానికి, శరీరంలో యాంటీఆక్సిడెంట్ ఫైటోన్యూట్రియెంట్స్, విటమిన్ సి, పొటాషియం వంటి పోషకాలను పెంచడానికి మీరు ఉదయం ఒక గ్లాస్ నీటిలో సగం నిమ్మకాయ, 1 టీస్పూన్ నెయ్యి, చిటికెడు దాల్చినచెక్కను మిక్స్ చేసి తాగొచ్చు. 

తినడానికి ముందు

భోజనానికి ముందు  నీటిని తాగడం కూడా మంచిదే. దీనివల్ల 'జీర్ణశయాంతర ప్రేగు' శుభ్రంగా ఉంటుంది. ఇది మీరు ఆరోగ్యంగా బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. తినడానికి ముందు నీళ్లను తాగడం వల్ల మీ జీర్ణ ప్రక్రియను మెరుగుపడుతుంది. ఇది మీ శరీరం ఆహారాన్ని సరిగ్గా ప్రాసెస్ చేయడానికి కూడా సహాయపడుతుంది. అంతేకాదు భోజనానికి ముందు నీళ్లను తాగడం వల్ల మీ బాడీ హైడ్రేట్ గా ఉంటుంది. దీంతో మీ శరీరం తన విధులను సక్రమంగా చేస్తుంది. 
 

Image: Getty

పడుకునే ముందు 

చాలా సార్లు గుండెపోటు నిద్రపోయే సమయంలోనే వస్తుందని శాస్త్రీయంగా రుజువైందని. అందుకే నిద్రపోయే ముందు నీటిని తాగడం వల్ల నిద్రపోతున్నప్పుడు గుండెపోటు వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. దీనితో పాటుగా ఇది మిమ్మల్ని రాత్రంగా హైడ్రేట్ గా ఉంచుతుంది. అలాగే మీ శరీరంలోని అన్ని టాక్సిన్స్ ను బయటకు పంపుతుంది. కడుపు నొప్పి, తిమ్మిరి నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. 

Image: Getty

స్నానానికి ముందు 

స్నానానికి ముందు కూడా ఖచ్చితంగా ఒక గ్లాస్ గోరువెచ్చని నీళ్లను తాగాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల మీ రక్తపోటు పెరిగే అవకాశం తగ్గుతుంది. స్నానం చేయడానికి ముందు ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తాగడం వల్ల మీ శరీరం లోపలి నుంచి వేడెక్కుతుంది. ఫలితంగా చర్మంపై , లోపల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. 
 

Image: Getty


ఈ పనులకు ముందు నీటిని తాగడం ప్రయోజనకరంగా ఉంటుంది

చెమట పట్టినప్పుడు, మసాజ్ తర్వాత, ఆవిరి పట్టినప్పుడు లేదా వ్యాయామానికి ముందు, తర్వాత నీళ్లను ఖచ్చితంగా తాగండి. ఎందుకంటే ఇది మీ శరీరానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. ఆహారం తినేటప్పుడు నీళ్లను తాగకూడదు. ఇలా తాగితే ఆహారాన్ని జీర్ణం చేయడానికి కారణమయ్యే అన్ని జీర్ణ రసాలు నీటిలో కలిసిపోతాయి. దీనివల్ల ఫుడ్ జీర్ణం కావడం కష్టమవుతుంది. 
 

Latest Videos

click me!