వీటిని తిన్న తర్వాత నీళ్లు అస్సలు తాగొద్దు

First Published | Sep 27, 2024, 2:02 PM IST

నీళ్లు ఆరోగ్యానికి మంచివే అయినా.. కొన్ని ఆహార పదార్థాలను తిన్న తర్వాత మాత్రం నీళ్లను అస్సలు తాగొద్దు. లేదంటే అజీర్ణం, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. 
 

కొంతమంది తినేటప్పుడు చుక్క నీళ్లను కూడా తాగరు. మరికొంతమంది బుక్క బుక్కకు నీళ్లు తాగుతుంటారు. నిజానికి తినేటప్పుడు, తిన్న తర్వాత వీలైనంత వరకు నీళ్లు తాగకపోవడమే మంచిదంటారు ఆరోగ్య నిపుణులు.

ఎందుకంటే తినేటప్పుడు నీళ్లను తాగితే తిన్నది సరిగ్గా జీర్ణం కాదు. అలాగే మీరు ఎన్నో సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా కొన్ని రకాల ఆహారాలను తిన్న తర్వాత నీళ్లను అస్సలు తాగకూడదు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

పల్లీలు:  చాలా మంది పల్లీలను తినేటప్పుడు, తిన్న తర్వాత బాగా నీళ్లను తాగుతుంటారు. కానీ ఇలా అస్సలు చేయకూడదు. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. పల్లీలను తిన్న వెంటనే మీరు నీళ్లను తాగితే దగ్గు, గొంతునొప్పి వంటి సమస్యలు వస్తాయి. అందుకే వేరుశనగ తిన్న వెంటనే నీళ్లను తాగొద్దంటారు. 

స్వీట్లు: స్వీట్లను తింటే విపరీతంగా దాహమవుతుంది.అందుకే స్వీట్లను తిన్న ప్రతి ఒక్కరూ వెంటనే నీళ్లను తాగేస్తుంటారు. కానీ ఇలా తాగితే మీ శరీరంలో రక్తంలో చక్కెర స్థాయిలు బాగా పెరిగిపోతాయి. ఇది మిమ్మల్ని టైప్ 2 డయాబెటీస్ బారిన పడేలా చేస్తుంది. కాబట్టి స్వీట్లను తిన్న వెంటనే నీళ్లను అస్సలు తాగకండి.


పండ్లు:  అవును పండ్లను తిన్న వెంటనే నీళ్లను తాగడం ఆరోగ్యానికి మంచిది కాదు. నిజానికి మీరు పండ్లను తిన్న తర్వాత నీళ్లను తాగాల్సిన అవసరమే ఉండదు. ఎందుకంటే ప్రతి పండులో వాటర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. కానీ మనలో చాలా మంది పండ్లను తిన్న తర్వాత కూడా నీళ్లను బాగా తాగుతుంటారు. అయితే పండ్లలో చక్కెర లేదా సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. కాబట్టి మీరు పండ్లను తిన్న 45 నిమిషాల వరకు నీళ్లను అస్సలు తాగొద్దు. 

ఐస్ క్రీమ్: ఐస్ క్రీంను తిన్న వెంటనే నీళ్లను తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది. కానీ ఐస్ క్రీం తిన్న వెంటనే నీళ్లను తాగొద్దంటారు ఆరోగ్య నిపుణులు. దాహంగా అనిపిస్తే ఐస్ క్రీంను తిన్న 15 నిమిషాల తర్వాత నీళ్లను తాగండి. ఎలాంటి సమస్యా ఉండదు. 

కాఫీ, టీ: టీ, కాఫీ లేదా వేడి వేడి పాలు వంటి వేడి  పాపానీయాలు తాగిన తర్వాత కూడా నీళ్లను తాగకూడదంటారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే అప్పుడే వీడిగా తాగి, మళ్లీ చల్ల నీళ్లను తాగితే ఎన్నో సమస్యలు వస్తాయి. ముఖ్యంగా గ్యాస్, ఎసిడిటీతో పాటుగా బరువు పెరగడం వంటి అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. 
 

స్పైసీ ఫుడ్స్: కారం కారంగా ఉండే ఆహారాలను తింటే బాగా దాహంగా అనిపిస్తుంది. వీటిని తిన్నాక వచ్చే మంటను తగ్గించుకునేందుకు నీళ్లను బాగా తాగుతుంటాం. కానీ కారంగా ఉండే ఆహారాలను తిన్న తర్వాత నీళ్లను తాగితే ఆ  మంట మొత్తం మీ నోటి చుట్టూ వ్యాపిస్తుంది. అంతేకాదు మంట మరింత పెరుగుతుంది. ఇది కడుపు అసౌకర్యం, ఇబ్బందిని కలిగిస్తుంది. 
 

కార్బోనేటేడ్ పానీయాలు:  తిన్న తర్వాత కొంతమంది ఖచ్చితంగా సోడా లేదా కార్బోనేటేడ్ వాటర్ ను తాగుతుంటారు. కానీ వీటిని తాగితే కడుపులో వాయువు పెరుగుతుంది. అలాగే కడుపు ఉబ్బరం సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతేకాదు ఇది మీరు తిన్నది అరగకుండా కూడా చేస్తుంది. 

హెవీ భోజనం: హెవీగా తిన్న వెంటనే మీరు నీళ్లను తాగితే ఇంకా తినాలనిపిస్తుంది. అలాగే కడుపు నిండినట్టుగా అనిపించదు. అంతేకాదు ఇది మిమ్మల్ని అసౌకర్యానికి కూడా గురిచేస్తుంది. అందుకే తిన్న వెంటనే నీళ్లను తాగకూడదు. మీరు తిన్న 30 నిమిషాల తర్వాత నీళ్లను తాగొచ్చు. 

Latest Videos

click me!