రాత్రి 8 గంటల్లోపు ఎందుకు తినాలంటారో తెలుసా?

First Published | Sep 26, 2024, 1:42 PM IST

చాలా మంది రాత్రి 9 దాటిన తర్వాతే తింటుంటారు. కానీ ఈ అలవాటు మీ ఆరోగ్యానికి అంత మంచిది కాదు. మీరు గనుక రాత్రి 8 గంటల లోపు డిన్నర్ చేస్తే మీరెన్ని లాభాలను పొందుతారో తెలుసా? 
 

Benefits of having early dinner

ఉదయమైనా, సాయంత్రమైనా సరైన సమయానికే తినాలంటారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే ఇది మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. కానీ చాలా మంది ఏ పూటైనా సరే సరైన సమయానికి తినరు. ఇదే వీరిని ఎన్నో సమస్యల బారిన పడేస్తుంది. 
 

dinner

కొంతమంది అయితే బరువు తగ్గాలని రాత్రిపూట తినడమే మానేస్తుంటారు. కానీ రాత్రిపూట తినకపోతే నిద్రలేమి, డిప్రెషన్ తో పాటుగా జీర్ణ సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు సరైన సమయానికి తింటేనే ఆరోగ్యంగా ఉంటారు.

మీరు ఏ టైం కు తింటున్నారనేది మీ జీర్ణక్రియ, నిద్ర నాణ్యత, జీవక్రియలను ప్రభావితం చేస్తుంది. 9,10 గంటలకు కాకుండా.. రాత్రి 8 గంటల్లోపు తింటే మీరు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

జీర్ణక్రియ సజావుగా సాగుతుంది

మీకు తెలుసా? రాత్రిపూట మన శరీర మెటబాలిజం తగ్గుతుంది. అందులో మీరు లేట్ గా తింటే ఆహారం జీర్ణం కావడానికి చాలా టైం పడుతుంది. ఇది మీ శరీరంలో కొవ్వులు పేరుకుపోవడానికి దారితీస్తుంది. దీంతో మీరు విపరీతంగా బరువు పెరిగిపోతారు. అలాగే ఒక్కోసారి కడుపు ఉబ్బరం సమస్య కూడా వచ్చే అవకాశం ఉంటుంది. 
 


అదే మీరు రాత్రి 8 గంటల్లోపు తింటే ఇలాంటి సమస్యలేమీ రావు. అలాగే మీరు తిన్నది సజావుగా జీర్ణం కావడానికి సమయం లభిస్తుంది. అలాగే గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు రావు. శరీరంలో కొవ్వులు కూడా పేరుకుపోవు. అందుకే రాత్రి 8 గంటల్లోపు భోజనం చేయడానికి ప్రయత్నించండి. 

మీకు తెలుసా? మనం నిద్రపోతున్నప్పుడు మన శరీరంలోని అన్ని అవయవాలు విశ్రాంతి తీసుకుంటాయి. కాబట్టి మీరు రాత్రి లేట్ గా భోజనం చేస్తే నిద్రపోయేటపుడు కడుపు ఉబ్బరంగా ఉంటుంది. దీంతో మీరు ఎలా పడుకున్నా నిద్రపట్టదు. అవయవాలకు విశ్రాంతి ఉండదు. ఇది మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. 

నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది

రాత్రిపూట మరీ హెవీగా తింటే మీరు ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా కడుపు నొప్పి, జీర్ణక్రియ సమస్యలు ఎక్కువగా వస్తాయి. అంతేకాదు మీకు తెల్లవార్లూ నిద్ర ఉండదు. అదే మీరు రాత్రి 8 గంటల్లోపు భోజనం చేస్తే తిన్నది 2 నుంచి 3 గంటల్లోపు జీర్ణమవుతుంది.

మీరు 8 కల్లా తినేసి రాత్రి 10 నుంచి 10.30 గంటల మధ్య నిద్రపోతే ఎలాంటి సమస్యలు రావు. బాగా విశ్రాంతి తీసుకుంటారు. ప్రశాంతంగా నిద్రపోతారు. మీరు 10, 11 గంటలకు తింటే మీ మీ కడుపు ఎప్పుడు విశ్రాంతి తీసుకుంటుంది? ఇది మీకు నిద్రలేకుండా చేస్తుంది. కాబట్టి మీరు త్వరగా తింటే త్వరగా నిద్రపోతారు. ఆరోగ్యంగా ఉంటారు. ఈ అలవాటు మీరు కంటినిండా నిద్రపోయేలా చేస్తుంది. 
 


వెయిట్ లాస్

మీరు త్వరగా భోజనం చేస్తే మీరు బరువు తగ్గుతారని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. మీరు తిన్న ఆహారం జీర్ణమైతే మీ పొట్టలో కొవ్వు పేరుకుపోదు. అలాగే విషం కూడా ఉండదు. నిజమేంటంటే? రాత్రిపూట మన మెటబాలిజం తక్కువగా ఉంటుంది. ఇది క్యాలరీల బర్నింగ్ పై ప్రభావం చూపుతుంది. 

కాబట్టి మీరు లేట్ గా తింటే శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది. బాగా బరువు పెరుగుతారు. మీరు రాత్రి 8 గంటల్లోపు తింటే మీరు చాలా సేపటి వరకు ఏమీ తినకుండా ఉంటారు. మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ వరకు ఏమీ తినకుండా ఉండటం వల్ల మీ శరీరానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. 

Latest Videos

click me!