చక్కెర లేకుండా కాఫీని తాగడం ఎందుకు మంచిదంటారో తెలుసా?

First Published | Sep 27, 2024, 12:31 PM IST

చక్కెర లేకుండా కాఫీ అంటేనే ఏదోలా అనిపిస్తుంది కదూ. ఎదుకంటే కాఫీ కాస్త చేదుగా ఉంటుంది. అందులో షుగర్ లేకుండా ఉంటే కాఫీని తాగడం కష్టమే మరి అనిపిస్తుంది. కానీ షుగర్ లేని కాఫీని తాగితే మీరు ఒకటి కాదు రెండు కాదు ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ను పొందుతారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

నిజానికి కాఫీ మన ఆరోగ్యానికి కొన్ని ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. అయితే కాఫీ ప్రయోజనాలు.. కాఫీలో ఏం కలుపుతున్నాం, ఎంత మొత్తంలో తాగుతున్నాం, మన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అనే వాటిపై ఆధారపడి ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

coffee

డాక్టర్లు, ఆరోగ్య నిపుణుల ప్రకారం.. కాఫీని లిమిట్ లో తాగితే మీరు బోలెడు ఆరోగ్య లాభాలను పొందుతారు. కాఫీని లిమిట్ గా తాగితే కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదం తగ్గుతుంది.

అలాగే మానసిక స్థితి మెరుగపడటం నుంచి పార్కిన్సన్, అల్జీమర్స్ వ్యాధుల ముప్పు తగ్గడం వరకు ఎన్నో లాభాలు కలుగుతాయి. కాఫీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో మంటను తగ్గిస్తాయి. అలాగే గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. 

కాఫీతో లాభాలున్నాయి కదా అని మీరు దీన్ని మోతాదుకు మించి తాగినా, చక్కెరను ఎక్కువగా వేసుకుని తాగినా, క్రీమ్ వంటి ఆరోగ్యాన్ని పాడు చేసే పదార్థాలను కలిపినా మీరు ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

ముఖ్యంగా కాఫీని ఇలా తాగడం వల్ల నిద్రలేమి, జీర్ణ సమస్యలు, బరువు పెరగడం వంటి ఎన్నో సమస్యలు వస్తాయి. అసలు చక్కెర లేని కాఫీని తాగడం వల్ల మన ఆరోగ్యానికి ఎలాంటి మేలు జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 


జీవక్రియను పెంచుతుంది

మీకు తెలుసా? చక్కెర లేకుండా కాఫీని తాగడం వల్ల మీ జీవక్రియ పెరుగుతుంది. కాఫీలో ఉండే కెఫిన్ థర్మోజెనిసిస్ ను ప్రోత్సహిస్తుంది. ఈ థర్మోజెనిసిస్ మన శరీరంలో వేడి ఉత్పత్తిని పెంచి ఎక్కువ కేలరీలు కరిగేలా చేస్తుంది.  అంటే చక్కెర లేని హెల్తీ కాఫీని తాగతే సులువుగా బరువు కూడా తగ్గొచ్చన్న మాట. మీరు వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే షుగర్ లేని కాఫీని తాగండి.  

మానసిక దృష్టిని పెంచుతుంది

షుగర్ లేని కాఫీని తాగితే మన మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. కాఫీలోని కెఫిన్  కంటెంట్ అడెనోసిన్ అనే న్యూరోట్రాన్స్మిటర్ ను నిరోధిస్తుంది. దీంతో డోపామైన్, నోర్పైన్ఫ్రైన్ ను పెరుగుతాయి. ఈ న్యూరోట్రాన్స్మిటర్ వల్ల మీ ఏకాగ్రత పెరుగుతుంది. అలాగే మీ మొత్తం అభిజ్ఞా పనితీరు కూడా మెరుగుపడుతుంది. 

యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి

కాఫీలో యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. ఇవి శరీరానికి హాని చేసే ఫ్రీ రాడికల్స్ ను తటస్తం చేస్తాయి. చక్కెర లేని బ్లాక్ కాఫీని తాగితే మీ శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతుంది. దీంతో కణాలు దెబ్బతినకుండా ఉంటాయి. అలాగే మీకు దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే రిస్క్ తగ్గుతుంది. 

శారీరక పనితీరును మెరుగుపడుతుంది

కాఫీలోని కెఫిన్ కంటెంట్ మన నాడీ వ్యవస్థను ఉత్తేజపరుస్తుంది. అలాగే శరీరంలోని కొవ్వును కరిగించడానికి సహాయపడుతుంది. అంటే ఇది మీరు మరింత శారీరక శ్రమను చేయడానికి అవసరమైన శక్తిని అందిస్తుంది. మీరు గనుక వ్యాయామానికి 30 నిమిషాల ముందు షుగర్ లేని బ్లాక్ కాఫీని తాగితే మీ ఒంట్లో శక్తి స్థాయిలు పెరుగుతాయి.  

టైప్ -2 డయాబెటిస్ ప్రమాదం తగ్గుతుంది

చక్కెర లేని కాఫీని తాగితే మీకు టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం చాలా వరకు తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మీకు తెలుసా? షుగర్ లేని కాఫీ ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుందని అధ్యయనాలు కూడా వెల్లడించాయి. చక్కెర లేని కాఫీని తాగితే రక్తంలో అకస్మత్తుగా షుగర్ లెవెల్స్ పెరిగే ప్రమాదం తగ్గుతుంది. 

గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది

షుగర్ లేని బ్లాక్ కాఫీని రోజూ తాగడం వల్ల మీకు గుండె జబ్బులు వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాఫీలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, ముఖ్యంగా క్లోరోజెనిక్ ఆమ్లం శరీర మంటను తగ్గిస్తుంది. అలాగే రక్తనాళాల పనితీరును మెరుగుపరచడానికి ఎంతగానో సహాయపడుతుంది. ఇది మీ గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి ఎంతగానో సహాయపడుతుంది. 

కాలేయ ఆరోగ్యం

షుగర్ లేని బ్లాక్ కాఫీ మిమ్మల్ని కాలెయ వ్యాధుల నుంచి కూడా రక్షిస్తుంది. ముఖ్యంగా ఈ కాఫీని తాగితే మీకు సిర్రోసిస్, ఫ్యాటీ లివర్, హెపటైటిస్ వంటి వ్యాధుల ముప్పు తప్పుతుంది. కాఫీలో ఉండే సమ్మేళనాలు కాలెయానికి హానిచేసే ఎంజైమ్ ల లెవెల్స్ ను తగ్గిస్తాయి. బ్లాక్ కాఫీ మీ కాలెయాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. 
 

దీర్ఘాయువు

షుగర్ లేని బ్లాక్ కాఫీ మన ఆయుష్షును పెంచడానికి కూడా సహాయపడుతుంది. పలు పరిశోధనల ప్రకారం.. షుగర్ లేని కాఫీని తాగే వారికి గుండె జబ్బులు, న్యూరోడెజెనరేటివ్ రుగ్మతలు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. అంతేకాదు వీరికి అకాల మరణ ముప్పు కూడా తగ్గుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. కాఫీలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు, యాంటీఆక్సిడెంట్లు మీరు ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడతాయి. 

Latest Videos

click me!