సిగరేట్ బీపీని పెంచుతుందా?

Published : Apr 25, 2023, 09:38 AM IST

రక్తపోటు పెరగడానికి ఎన్నో కారణాలున్నాయి. అందులో ప్రధాన కారణం స్మోకింగ్ అంటున్నారు నిపుణులు.  స్మోకింగ్ చేసేవారికి హై బీపీ సమస్య వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.   

PREV
17
సిగరేట్ బీపీని పెంచుతుందా?

స్మోకింగ్ ఏ రకంగానూ మీ ఆరోగ్యానికి మంచి చేయదు. దీనివల్ల ఎన్నో ప్రాణాంతక రోగాలు వస్తాయి. ఈ ముచ్చట దాదాపు అందరికీ తెలుసు. కానీ దీన్ని మాత్రం మానేయలేకపోతుంటారు. ఎందుకంటే దీన్ని మానేయడం అనుకున్నంత సులువు కాదు కాబట్టి. ఏదేమైనా ఈ  అలవాటు మనిషిని ఎన్నో విధాలుగా ప్రభావితం చేస్తుంది. అందుకే కష్టమైనా దీన్ని వదులుకోవడమే మంచిదని డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మీకు తెలుసా సిగరేట్ కాల్చేవారికి అధిక రక్తపోటు సమస్య కూడా వస్తుందని నిపుణులు చెబుతున్నారు. సిగరెట్లలో నికోటిన్ ఉంటుంది. ఇదే మీ రక్తపోటు స్థాయిలు పెరగడానికి కారణమవుతుంది. రెగ్యులర్ గా స్మోకింగ్ చేసేవారికి అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం ఉంది. 

27

smoking

అధిక రక్తపోటు, ధూమపానం మధ్య సంబంధం

అధిక రక్తపోటు ధమనుల గోడలపైకి నెట్టే రక్తం శక్తి చాలా ఎక్కువగా ఉన్నప్పుడు సంభవించే ఒక సాధారణ సమస్య. దీనివల్ల మీ గుండె రక్తాన్ని పంప్ చేయడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఇది గుండె సమస్యలతో పాటుగా మరెన్నో సమస్యలకు దారితీస్తుంది. అధిక రక్తపోటుకు ఎన్నో కారణాలు ఉన్నప్పటికీ..  ధూమపానం హైబీపీ ప్రధాన కారణమంటున్నారు నిపుణులు. 
 

37

ధూమపానం అధిక రక్తపోటుకు కారణమవుతుందని శాస్త్రీయంగా నిరూపించబడిందని నిపుణులు అంటున్నారు. సిగరెట్లలోని నికోటిన్ వాసోప్రెసిన్, ఆడ్రినలిన్ వంటి అడ్రినెర్జిక్ హార్మోన్ల విడుదలకు దారితీస్తుంది. ఇది మీ రక్తపోటు పెరగడానికి కారణమవుతుంది. అలాగే గుండె జబ్బులు వచ్చే అవకాశాలను కూడా పెంచుతుంది.
 

47

హైబీపీ సమస్య లేని వ్యక్తి రోజూ సిగరేట్ తాగితే రక్తపోటు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. అయితే బీపీకు పేషెంట్లు హైబీపీ నుంచి మాలిగ్నెంట్ హైపర్ టెన్షన్ సమస్య వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు మూత్రపిండాలకు రక్త సరఫరా తగ్గిపోయి రెనో వాస్కులర్ హైపర్ టెన్షన్ సమస్య కూడా వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. 

57

మరో మాటలో చెప్పాలంటే.. క్రమం తప్పకుండా ధూమపానం చేస్తే మీ రక్తపోటును పెంచడానికి కారణమయ్యే ఎక్కువ హార్మోన్లను విడుదల అవుతాయి. సిగరెట్లు తాగడం ఆరోగ్యానికి హానికరం. అయితే పొగలేని పొగాకు మీ రక్తపోటు స్థాయిలను కూడా పెంచుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
 

67

ధూమపానం మానేయడం ఎలా?

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. ధూమపానం మానేస్తే తొందరగా చనిపోయే ప్రమాదం తప్పుతుంది. మీకు తెలుసా ఇది మరణానికి అత్యంత ముఖ్యమైన కారణాలలో ఒకటి. పొగాకు వాడకం వల్ల ప్రతి ఆరు సెకన్లకు ఒకరు చనిపోతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ధూమపానం తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుంది. అందుకే ఈ అలవాటును మానుకోవడం మంచిది. దీన్ని కాల్చాలన్ని కోరికలను నియంత్రించడానికి కొన్ని చిట్కాలు.. 
 

77
Smoking

నికోటిన్ రీప్లేస్మెంట్ థెరపీ

నికోటిన్ మానేయడానికి అత్యంత సాధారణ మార్గాలలో దీనిని ఒకటిగా నమ్ముతారు. నికోటిన్ రీప్లేస్మెంట్ థెరపీ కోరికలను ఎదుర్కోవడానికి మీకు సహాయపడుతుంది. నికోటిన్ గమ్, స్ప్రేలు, ఇన్హేలర్లు మొదలైనవి ఉన్నాయి. ధూమపానం మానేయడానికి ఇవి మీకు బాగా సహాయపడతాయి. అలాగే సిగరేట్ కాల్చాలి అనిపించినప్పుడు మీ మైండ్ ను డైవర్ట్ చేయండి. ఇష్టమైన వంట చేయడమో, ఇష్టమైన వారితో మాట్లాడటమో, పనులు చేయడమో చేయండి. ఇవి మీరు సిగరేట్ కోరికల నుంచి తప్పించుకోవడానికి సహాయపడతాయి. 
 

click me!

Recommended Stories