కిడ్నీల్లో రాళ్ల నుంచి అంగస్తంభన లోపం వరకు.. డీహైడ్రేషన్ వల్ల ఎన్ని సమస్యలు వస్తాయో తెలుసా?

First Published Apr 24, 2023, 3:53 PM IST

నిర్జలీకణం ఎన్నో రోగాల బారిన పడేస్తుంది. ముఖ్యంగా ఇది మూత్ర ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. నిర్జలీకరణాన్ని నివారించడానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

ఎండాకాలలంలో నిర్జలీకరణం ఒక సాధారణ సమస్య. శరీరంలోని ద్రవాలు ఎక్కువగా బయటకు పోయినప్పుడు ఈ సమస్య వస్తుంది. మండుతున్న ఎండల వల్ల శరీరంలోని ద్రవాలన్నీ బయటకు పోతాయి. ఇది డీహైడ్రేషన్ కు దారితీస్తుంది. ఇది మూత్ర ఆరోగ్యంపై ఎంత ప్రభావం చూపుతుంది. ఇది ఎన్నో మూత్ర సమస్యలకు దారితీస్తుంది. నిర్జలీకరణం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

నిర్జలీకరణం మూత్ర ఉత్పత్తి తగ్గడానికి కారణమవుతుంది. ఇది మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటానికి దారితీస్తుంది. అలాగే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని పెంచుతుంది. అంతేకాదు ద్రవాలను తీసుకోకపోవడం వల్ల మూత్రం సాంద్రీకృతమవుతుంది. ఇది మూత్రాశయ ఇన్ఫెక్షన్లు, ఇతర యూరోలాజికల్ సమస్యలకు దారితీస్తుంది. అందుకే యూరాలజికల్ సిస్టమ్ పనితీరు సరిగ్గా ఉండేందుకు ఈ తీవ్రమైన సమస్యలను నివారించడానికి హైడ్రేటెడ్ గా ఉండటం చాలా ముఖ్యం.
 

Latest Videos


మూత్రపిండాల్లో రాళ్లు

నిర్జలీకరణం మూత్రాన్ని ఆపేస్తుంది. దీనివల్ల శరీరంలో అవాంఛిత పదార్థాలు, ఖనిజాలు పేరుకుపోవడానికి దారితీస్తుంది. ఇది మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటానికి కారణమవుతుంది. ఈ రాళ్లు మూత్ర మార్గంలో  విపరీతమైన నొప్పిని కలిగిస్తాయి. 
 

యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ 

నిర్జలీకరణం యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని పెంచుతుంది. శరీరం నిర్జలీకరణానికి గురైనప్పుడు మూత్ర మార్గము నుంచి బ్యాక్టీరియాను బయటకు తీయడానికి తగినంత మూత్రాన్ని ఉత్పత్తి చేయకపోవచ్చు. ఇది సంక్రమణకు దారితీస్తుంది.
 

మూత్రాశయ సమస్యలు

శరీరం నిర్జలీకరణానికి గురైనప్పుడు మూత్రం చిక్కగా మారుతుంది. ఇది మూత్రాశయాన్ని చికాకుపెడుతుంది. ఎర్రబడేలా చేస్తుంది. ఈ చికాకు మూత్ర ఫ్రీక్వెన్సీ, మూత్ర విసర్జన సమయంలో నొప్పి వంటి సమస్యలను కలిగిస్తుంది. రోజంతా పుష్కలంగా ద్రవాలను తాగితే మూత్రం పలుచగా మారుతుంది. అలాగే మూత్రాశయ చికాకు కూడా తగ్గుతుంది. దీంతో మూత్రాశయ సమస్యలు తగ్గుతాయి. 
 

ప్రోస్టేట్ సమస్యలు

నిర్జలీకరణం వల్ల మూత్ర పరిమాణం తగ్గుతుంది. అంటే దీనివల్ల మూత్రం కొద్దిగానే వస్తుంది. ఇది ప్రోస్టేట్ గ్రంథి సమస్యలకు దారితీస్తుంది. ప్రోస్టేట్ గ్రంథి విస్తరించి మూత్ర ప్రవాహంతో సమస్యలను కలిగిస్తుంది.
 

అంగస్తంభన లోపం

నిర్జలీకరణం పురుషాంగానికి రక్త ప్రవాహాన్ని తగ్గించి.. అంగస్తంభన లోపానికి దారితీస్తుంది. శరీరం నిర్జలీకరణానికి గురైనప్పుడు పురుషాంగానికి తగినంత రక్త ప్రవాహాన్ని పంపడానికి ఇది తగినంత రక్త పరిమాణాన్ని ఉత్పత్తి చేయదు. ఇది అంగస్తంభనను కష్టతరం చేస్తుంది. ఇలాంటి సమస్య రాకూడదదంటే హైడ్రేటెడ్ గా ఉండటం చాలా అవసరం. 

click me!