మీరు టీ తాగుతరా? అయితే జాగ్రత్త..!

First Published Apr 25, 2023, 7:15 AM IST

టీ తాగే అలవాటు ఉన్నవారికి దీన్ని తాగితేనే మనసు కుదుట పడుతుంది. అంతేకాదు ఒంట్లో అప్పటికప్పుడే బలం పెరిగినట్టు అనిపిస్తుంది. నిజానికి టీని మోతాదులో తాగితే ఆరోగ్యానికి కొంతవరకు మేలే జరుగుతుంది. కానీ మరీ ఎక్కువగా తాగితే మాత్రం.. 
 

చాలా మందికి టీ తాగే అలవాటు ఉంటుంది. కొంతమంది రోజుకు ఒకటి రెండు సార్లు తాగితే.. కొందరు ఐదారు సార్లు కూడా తాగుతుంటారు. మీరు గమనించారో లేదో కానీ టీ కి అలవాటైన వారు టైం టూ టైం తాగుతుంటారు. ఇది వారిని ఎనర్జిటిక్ గా, యాక్టీవ్ గా మారుస్తుంది. అందుకే ప్రపంచంలో అత్యంత ఇష్టమైన పానీయాలలో టీ ఒకటిగా మారిపోయింది. టీ ఎంపిక అనేది వ్యక్తికి వ్యక్తికి, ప్రాంతాన్ని బట్టి మారుతుంది. కానీ టీని మరీ ఎక్కువగా తాగితే మాత్రం నిద్రలేమి, ఒత్తిడి, జీవక్రియ మందగించడం వంటి ఎన్నో సమస్యలు వస్తాయి. అసలు టీని ఎక్కువగా తాగితే ఏమౌతుందో ఇప్పుడు తెలుసుకుందాం..
 

ఆందోళన, ఒత్తిడిని పెంచుతుంది

టీ ఆకుల్లో సహజంగా కెఫిన్ కంటెంట్ ఉంటుంది. టీ లేదా వేరే ఇతర పానీయాల ద్వారా కెఫిన్ ను ఎక్కువగా తీసుకుంటే ఆందోళన, ఒత్తిడి, చంచలత భావాలు పెరుగుతాయి. ఇది తలనొప్పి, కండరాల ఉద్రిక్తత, భయాందోళనలను కూడా ప్రేరేపిస్తుంది. ఇది మీ మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. రోజుకు 200 మి.గ్రా కంటే తక్కువ కెఫిన్ ను తీసుకున్న చాలా మందికి ఆందోళన కలగలేదని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

Latest Videos


పేలవమైన నిద్ర లేదా నిద్ర రుగ్మతలు

రాత్రిళ్లు సరిగ్గా నిద్రపట్టకపోవడం లేదా నిద్ర లేకపోవడం లేదా నిద్రలేమితో బాధపడుతున్నారా? అయితే మీరు టీని మానేయాల్సిందే. ఎందుకంటే టీలో ఉండే కెఫిన్ కంటెంట్ మీ నిద్రకు భంగం కలిగిస్తుంది. మెలటోనిన్ అనేది ఒక హార్మోన్. ఇది నిద్రపోయే సమయం అని మీ మెదడుకు సంకేతం ఇస్తుంది. కెఫిన్ మెలటోనిన్ ఉత్పత్తిని నిరోధిస్తుందని కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి. దీని ఫలితంగా నిద్ర నాణ్యత తక్కువగా ఉంటుంది.

తక్కువ పోషక శోషణ

కెఫిన్ ను ఎక్కువగా తీసుకోవడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఎందుకంటే ఇది మన జీర్ణక్రియకు ఆటంకం కలిగిస్తుంది. పోషణ శోషణను తగ్గిస్తుంది. టీ టానిన్లు అని పిలువబడే సమ్మేళనాల గొప్ప మూలం. ఇవి కొన్ని ఆహారాలలో ఇనుముతో బంధిస్తాయి. టీ టానిన్లు జంతు ఆధారిత ఆహారాల కంటే మొక్కల వనరుల నుంచి ఇనుము శోషణకు ఆటంకం కలిగిస్తాయని పరిశోధనలు సూచిస్తున్నాయి.
 

అలాగే టీ తాగడం.. ముఖ్యంగా పాల ఆధారిత టీ తాగడం వల్ల మీకు వికారంగా కూడా అనిపించొచ్చు. టానిన్లు ఉండటం వల్ల ఇది మీ జీర్ణ కణజాలాన్ని చికాకుపెడుతుంది. కడుపు ఉబ్బరం, అసౌకర్యం, కడుపు నొప్పికి దారితీస్తుంది.

click me!