సీజనల్ ఫ్రూట్ రేగిపండ్లలో దాగి ఉన్న ఔషధ గుణాలు ఏంటో తెలుసా?

First Published Jan 8, 2022, 12:21 PM IST

రేగిపండ్లను (Raspberries) భోగి పండ్లు అని కూడా అంటారు. రేగిపండ్లను భానుడి చిహ్నంగా భావిస్తారు. సంక్రాంతి సమయంలో వచ్చే భోగి రోజున పిల్లలకు భోగి పండ్లను పోస్తే పిల్లల మానసిక రుగ్మతలు తగ్గిపోతాయని నమ్మకం. రేగిపండ్లను బెర్‌, బెరి అని వివిధ రకాలుగా పిలుస్తారు. అయితే రేగిపండ్లను తింటే శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు (Health benefits) కలుగుతాయి. ఆ ప్రయోజనాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
 

రేగిపండ్లు రుచికి తియ్యగా, పుల్లగా ఉంటాయి. ఇందులో అనేక ఔషధ గుణాలు (Medicinal properties) ఉంటాయి. ఇందులో ఉండే పోషకాలు శరీర ఆరోగ్యంతో పాటు చర్మ సౌందర్యానికి కూడా ఉపయోగపడతాయి. రేగిపండ్లు శరీరానికి మంచి ఎనర్జీ బూస్టర్ (Energy booster) గా సహాయపడుతాయి.
 

ఇవి శరీరానికి కావలసిన శక్తిని అందించి వ్యాధులతో పోరాడే సామర్థ్యాన్ని పెంచుతాయి. రేగిపండ్లలో విటమిన్ సి, ఐరన్, ఫాస్పరస్, క్యాల్షియం, ఫైబర్, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. వీటితోపాటు యాంటీ ఆక్సిడెంట్లు (Antioxidants), యాంటీ ఏజింగ్ లక్షణాలు (Anti-aging properties) సమృద్ధిగా ఉంటాయి.
 

రేగిపండ్లలో ఉండే సుగుణాలు శరీరంలోని హార్మోన్ లను సమతుల్యం చేసి శరీరానికి, మెదడుకు విశ్రాంతిని కలిగిస్తాయి. రేగిపండ్లతో పాటు బెరడు (Bark), ఆకులు (Leaves), గింజలు ఇలా రేగిచెట్టే ఒక దివ్యౌషధంగా సహాయపడుతుంది. బరువు తగ్గాలనుకునే వారు రేగిపండ్లను తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
 

ఇందులో తక్కువ మొత్తంలో క్యాలరీలు, ఎక్కువ మొత్తంలో ఫైబర్ (Fiber), ప్రొటీన్లు (Proteins) ఉంటాయి. ఇవి తీసుకున్న ఆహారాన్ని తేలికగా జీర్ణ పరిచి జీర్ణాశయ వ్యర్థాలను బయటకు తేలికగా పంపించడానికి సహాయపడుతాయి. అంతే కాకుండా శరీరానికి కావాల్సిన అనేక పోషకాలను అందిస్తాయి. రేగిపండ్లలో ఐరన్, పాస్పరస్ పుష్కలంగా ఉంటాయి.
 

ఇవి రక్తంలోని ఎర్ర రక్త కణాల అభివృద్ధికి సహాయపడుతాయి. దీంతో ఐరన్ (Iron), రక్తహీనతను (Anemia) సమస్యలతో బాధపడేవారు, కండరాలు అజీర్తి సమస్యతో బాధపడేవారు రేగిపండ్లను తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. రేగిపండ్లలో ఉండే క్యాల్షియం, పాస్ఫరస్, ఐరన్ ఎముకలకు కావలసిన శక్తిని అందించి ఎముకలు దృఢంగా చేస్తాయి.
 

వయసు పైబడటంతో వచ్చే కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు వంటి సమస్యలను తగ్గించడానికి సహాయపడుతాయి. రేగిపండ్లను పిల్లలకు తినిపిస్తే వారిలో శారీరక, మానసిక ఎదుగుదల బాగుంటుంది. శరీరానికి వ్యాధులతో పోరాడే సామర్ధ్యాన్ని పెంచి వ్యాధి నిరోధక శక్తిని (immunity) పెంచుతాయి. రేగిపండులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఏజింగ్ లక్షణాలు శరీర ఆరోగ్యంతో పాటు చర్మ సౌందర్యానికి (Skin beauty) కూడా పెంచుతాయి. 
 

ముఖం పై ఏర్పడ్డ ముడతలు, వలయాలు, మచ్చలను తొలగించి వృద్ధాప్య లక్షణాలు (Symptoms of aging) కనిపించకుండా చేస్తాయి. చర్మానికి ఇన్ఫెక్షన్లతో (Infection) పోరాడే సామర్థ్యాన్ని పెంచుతాయి. చర్మానికి మంచి నిగారింపును కాంతిని అందిస్తాయి. యవ్వనంగా కనిపించేందుకు సహాయపడతాయి.
 

అంతేకాకుండా తలనొప్పి (Headache), జలుబు, మలబద్ధకం, మూత్రాశయంలో రాళ్ళు వంటి సమస్యలను తగ్గించడానికి రేగిపండ్లు సహాయపడుతాయి. రేగి పండు లో ఉండే మరొక ముఖ్యమైన లక్షణం క్యాన్సర్ (Cancer) నివారిణిగా సహాయపడతాయి.

click me!