అలాంటి వ్యాధులను తగ్గించే సూపర్ హెల్తీ డ్రింక్స్.. ఓసారి ట్రై చేయండి!

First Published Jan 8, 2022, 1:30 PM IST

వాతావరణంలోని మార్పుల కారణంగా మన శరీరం అనేక ఇన్ఫెక్షన్లకు (Infection) గురయ్యే అవకాశం ఉంటుంది. దీంతో శరీరం నిరసించి శక్తిని కోల్పోతుంది. శరీరానికి తగిన శక్తి కావాలన్నా, ఆ రోజంతా ఉత్సాహంగా ఉండాలంటే మనం తీసుకునే ఆహార పదార్థాలతో పాటు కొన్ని సూపర్ హెల్తీ డ్రింక్స్ (Super Healthy Drinks) ను ఉదయం సేవిస్తే మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
 

ఇంట్లోనే సహజ సిద్ధమైన ఇంటి పదార్థాలతో చేసుకునే పానీయాలు జీర్ణక్రియను (Digestion) పెంచడంతోపాటు అనారోగ్య సమస్యలకు (Illness issues) దూరంగా ఉంచుతాయి. ఇవి శరీరానికి కావలసిన శక్తిని అందించే ఎనర్జీ డ్రింక్స్ గా సహాయపడుతాయి. ఈ సహజ సిద్ధమైన పానీయాలను సేవిస్తే రోజంతా ఉత్సాహంగా ఉంటారు. శరీర వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి.
 

నిమ్మ, తేనె: ఉదయం గోరువెచ్చని నీటిలో నిమ్మరసం (Lemon juice), తేనె (Honey) కలుపుకుని తాగితే జలుబు, దగ్గు, గొంతు ఇన్ఫెక్షన్ లు తగ్గుతాయి. ఈ డ్రింక్ ను సేవిస్తే రక్తం శుద్ధి జరగడంతో పాటు రక్త కణాల సంఖ్య కూడా పెరుగుతుంది. ముఖంపై ముడతలు, మచ్చలు, వృద్ధాప్య లక్షణాలు తగ్గుతాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. శరీరానికి కావలసిన శక్తిని అందించి ఆ రోజంతా ఉత్సాహంగా ఉండేందుకు సాయపడుతుంది.
 

దాల్చిన చెక్క: దాల్చిన చెక్కలో యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీర బరువును తగ్గించడానికి సహాయపడుతాయి. కనుక ఉదయం గోరువెచ్చని నీటిలో దాల్చిన చెక్క పొడి (Cinnamon Powder ), తేనె (Honey) కలుపుకొని తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులో ఉండే పోషకాలు శరీర ఆరోగ్యంతో పాటు చర్మ సౌందర్యానికి కూడా సహాయపడతాయి. ఈ డ్రింక్ ను తీసుకుంటే శరీర బరువు తగ్గుతుంది. 
 

అల్లం, తేనె, రాక్ సాల్ట్: ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కొంచెం రాళ్ల ఉప్పు (Rock salt), తేనె (Honey), అల్లం పొడి (Ginger powder) వేసి కలుపుకుని తాగాలి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఈ పానీయాన్ని సేవిస్తే నెలసరి నొప్పులు, పాదాల నొప్పులు వంటి సమస్యలు తగ్గుతాయి. బరువును కూడా అదుపులో ఉంచుతుంది. శీతాకాలంలో ఈ పానీయాన్ని తీసుకోవడం మంచిది.
 

తులసి ఆకుల కషాయం: తులసి ఆకులను యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి సీజన్లలో ఏర్పడే ఇన్ఫెక్షన్ లను తగ్గడానికి సహాయ పడతాయి. కనుక తులసి ఆకులను నీళ్లలో మరిగించి చల్లార్చి తాగితే దగ్గు కఫం లాంటి ఇన్ఫెక్షన్ వ్యాధులు తగ్గుతాయి.
 

మిరియాల కషాయం: వాతావరణంలోని మార్పుల కారణంగా గొంతు బొంగురుగా ఉంటే ఈ సమస్యను తగ్గించడానికి మిరియాలు (Pepper) దివ్యౌషధంగా సహాయపడతాయి. గొంతు బొంగురుగా ఉన్న సమయంలో మిరియాల కాషాయాన్ని తాగితే గొంతు సమస్యలు (Throat problems) తగ్గడంతో పాటు జలుబు, దగ్గు నుంచి విముక్తి కలుగుతుంది. మిరియాల పొడిని బెల్లంతో తీసుకున్న మంచి ఫలితం ఉంటుంది.

click me!