XRX కోడ్ ఉన్న మందుల్ని మత్తు పదార్థాలు, మానసిక సంబంధిత మందులు అంటారు. ఈ మందులన్నీ X అనే అక్షరంతో మొదలవుతాయి. ఇవి చాలా నొప్పిని తగ్గించేవిగా, మత్తు మందులుగా పనిచేస్తాయి. ఈ మందుల్ని క్యాన్సర్ పేషెంట్లు, మానసిక రోగులు, పెద్ద ఆపరేషన్లు చేయించుకున్న వాళ్లకు ఇస్తారు.
అందరు డాక్టర్లు ఈ మందుల్ని రాయరు. ముఖ్యంగా మానసిక వైద్యులు, మత్తు మందు నిపుణులు, క్యాన్సర్ నిపుణులు ఎక్కువగా రాస్తారు. XRX రకం ప్రిస్క్రిప్షన్‌ను రాసిన రోజు ఒక్కసారి మాత్రమే వాడాలి. ఈ ప్రిస్క్రిప్షన్‌ను మందుల షాపు వాళ్లు పేషెంట్ వివరాలతో 2 ఏళ్ల వరకు దాచిపెట్టాలట.