తిన్న తర్వాత బద్దకంగా అనిపిస్తోందా? ఇలా తగ్గించుకోండి

Published : Aug 03, 2023, 11:43 AM IST

లంచ్ చేసిన తర్వాత చాలా మందికి బద్ధకంగా, నిద్రమత్తుగా అనిపిస్తుంది. ఈ బద్ధకం కారణంగా ఏ పనీ చేయలేకపోతుంటారు. తిన్న తర్వాత సోమరితనాన్ని ఎలా తగ్గించుకోవాంటే?   

PREV
17
 తిన్న తర్వాత బద్దకంగా అనిపిస్తోందా? ఇలా తగ్గించుకోండి

చాలా మంది ఆహారం తిన్న తర్వాత బాగా నిద్రపోతుంటారు. ముఖ్యంగా మధ్యాహ్నం భోజనం తర్వాత చాలా మంది ఆఫీసు పనులను చేయలేకపోతుంటారు. కారణం బద్దకంగా అనిపించడమే. జీర్ణ సమస్యలు,  నిద్రచక్రం వల్లే ఇలా అయ్యే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. అయితే మీరెంత తింటున్నారు? ఏం తింటున్నారు? అనే దానిపై కూడా ఇది ఆధారపడి ఉంటుంది. ఇవి కూడా బద్దకానికి కారణమవుతాయి. 
 

27
laziness

తిన్న తర్వాత బద్ధకంగా అనిపించడానికి కారణం ? 

తిన్న తర్వాత బద్ధకంగా అనిపించడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. మీరు తినే ఆహారంలో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండటం వల్ల మీ నిద్రకు భంగం కలుగుతుంది. తిన్న తర్వాత శరీరంలో  సెరోటోనిన్ ఉత్పత్తి ఎక్కువగా అవుతుంది. దీనివల్ల కూడా అలసట కలుగుతుందని పలు పరిశోధనలు చెబుతున్నాయి. సెరోటోనిన్ అనేది ఒక రసాయనం. ఇది నిద్ర, మానసిక స్థితి చక్రాన్ని నియంత్రించడానికి బాధ్యత వహిస్తుంది. ఎక్కువ తినడం వల్ల బద్ధకంగా, అలసటగా ఉంటుంది. తక్కువ తినేవారి కంటే ఎక్కువ తినే వారే ఎక్కువ బద్దకంగా ఉంటుంది. ఎక్కువ తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. అలాగే శక్తి తగ్గుతుంది.
 

37
laziness

ఇవి బద్దకానికి దారితీస్తాయి

పాస్తా, రైస్,వైట్ బ్రెడ్, కేక్, కుకీలు, డోనట్స్, మఫిన్స్
భుట్టా మిల్క్ షుగర్, క్యాండీ
సాల్మన్,చికెన్, గుడ్లు
బచ్చలికూర, మిల్క్, సోయా ఉత్పత్తులు, జున్ను

47
Fatigue

తిన్న తర్వాత బద్ధకంగా అనిపించొద్దంటే

ఎక్కువగా తినడం మానుకోండి

మీ ప్లేట్ ను ఫుల్ గా నింపడం మానుకోండి. భోజనం ఎక్కువగా చేయడం వల్ల శరీరం పోషకాలను విచ్ఛిన్నం చేయడానికి, గ్రహించడానికి జీర్ణవ్యవస్థకు ఎక్కువ రక్త ప్రవాహాన్ని కలిగిస్తుంది. ఈ ప్రక్రియకు శక్తి చాలా అవసరం. ఇది మీకు అలసటను, బద్ధకాన్ని కలిగిస్తుంది. ఎక్కువ మొత్తంలో తినడం వల్ల కడుపు సాగదీస్తుంది. అలాగే అసౌకర్యం కలుగుతుంది. ఇది విశ్రాంతి తీసుకోవడానికి, శక్తిని ఆదా చేయాలనే కోరికకు దారితీస్తుంది. కొన్ని ఆహారాలు సెరోటోనిన్, మెలటోనిన్ వంటి హార్మోన్లను విడుదల చేస్తాయి. ఇది మరింత బద్ధకానికి దారితీస్తుంది.

57
Fatigue

గ్లైసెమిక్ ఇండెక్స్ 

గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉన్న ఆహారాలను తిన్న తర్వాత సోమరితనంగా అనిపించడం సర్వసాధారణం. ఎక్కువ జీఐ ఆహారాలు కార్బోహైడ్రేట్లు. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచుతాయి ఎందుకంటే ఇవి చాలా త్వరగా జీర్ణమవుతాయి. అలాగే త్వరగా గ్రహించబడతాయి. వైట్ బ్రెడ్, తెల్ల బియ్యం, కార్న్ ఫ్లేక్స్, ఇతర ప్రాసెస్ చేసిన ధాన్యాలు, బంగాళాదుంపలు, స్వీట్లు, శీతల పానీయాలు, చక్కెర పానీయాల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. 
 

67

తిన్న తర్వాత శారీరకంగా చురుకుగా ఉండండి

తిన్న తర్వాత వెంటనే పడుకోకూడదు. తిన్న తర్వాత కనీసం 100 అడుగులైనా నడవండి. లేదా 15 నుంచి 20 నిమిషాల  పాటు తేలికపాటి పనులను చేయండి. నడక జీర్ణ ప్రక్రియను ఉత్తేజపరచడానికి, జీర్ణవ్యవస్థ ద్వారా ఆహార కదలికకు సహాయపడతుంది. అలాగే అజీర్ణ సంభావ్యతను కూడా తగ్గిస్తుంది. తేలికపాటి నడక రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఇది మీకు మరింత శక్తివంతంగా ఉండటానికి సహాయపడుతుంది.
 

77

కెఫిన్, ఆల్కహాల్ పరిమితం చేయండి

కెఫిన్ తక్షణమే మనకు శక్తినిచ్చినప్పటికీ... దీనిని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎన్నో సమస్యలు వస్తాయి. దీనికి తోడు ఆల్కహాల్ సోమరితనాన్ని కలిగిస్తుంది. అందుకే వీటిని ఎక్కువగా తాగడం మానుకోవాలి. 

Read more Photos on
click me!

Recommended Stories