Health Tips: పెళ్లికి ముందే ఆరోగ్యంగా స్లిమ్ అవ్వాలా.. అయితే ఈ చిట్కాలు పాటించండి?

Published : Aug 03, 2023, 10:56 AM IST

Health Tips: సాధారణంగా పెళ్లి అనగానే కాస్త ఒత్తిడికి గురవుతారు అమ్మాయిలు, అబ్బాయిలు. కాస్త లావుగా ఉన్నవారు ఆ ఒత్తిడికి మరి కాస్త లావైపోతారు కాబట్టి పెళ్లిలో స్లిమ్ గా కనిపించాలి అనుకుంటే ఈ చిట్కాలు పాటించండి.  

PREV
16
Health Tips: పెళ్లికి ముందే ఆరోగ్యంగా స్లిమ్ అవ్వాలా.. అయితే ఈ చిట్కాలు పాటించండి?

అసలే బొద్దుగా ఉన్న అమ్మాయిలకి అబ్బాయిలకి కాస్త ఇన్ఫిరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది. వాళ్లకి గాని పెళ్లి కుదిరింది అంటే ఆనందం కన్నా ఎక్కువగా కంగారు పడతారు. ఎందుకంటే పెళ్లి ముస్తాబులో మరింత లావుగా కనపడతారేమో అని వాళ్ళ భయం.

26

కంగారు పడకండి.. ఈ చిట్కాలు పాటిస్తే మీకున్న బెల్లీ ఫ్యాట్ తగ్గి మీరు కూడా నాజూగ్గా తయారవుతారు. ఆ చిట్కాలు ఏంటో చూద్దాం. ముందుగా మీ భోజనం లో రైస్ తక్కువ క్వాంటిటీ, కర్రీ ఎక్కువ క్వాంటిటీ ఉండేలాగా చూసుకోండి. బంగాళదుంపల లాంటి పిండి పదార్థాలు ఉన్న కూరగాయల జోలికి పోకండి.

36

భోజనానికి ముందు ఒక గ్లాసు నీరు తాగండి. దాని వలన మీరు ఎక్కువ ఆహారం తీసుకునే అవకాశం ఉండదు. మళ్లీ ఆకలిగా అనిపిస్తే రైస్ కన్నా ఫ్రూట్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి.

46

ప్రతిరోజు 45 నిమిషాల పాటు వ్యాయామం తప్పనిసరిగా చేయండి. అలాగే ప్రతి రాత్రి కనీసం ఏడు గంటలు నిద్రపోండి. పెళ్లి పనుల ఒత్తిడిలో మీకు సరిగ్గా నిద్ర పట్టదు నిజమే కానీ నిద్ర పట్టడం కోసం ప్రికాషన్స్ తీసుకోండి.
 

56

అలాగే పండ్లు ఎక్కువగా తినటానికి ప్రిఫర్ చేయండి జ్యూస్ లో తాగతాన్ని అవాయిడ్ చేయండి. పండ్ల లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అదే పండుని జ్యూస్ చేసినప్పుడు దానిలో ఉండే ఫైబర్ బయటికి తీసేస్తారు మరియు అందులో చక్కెరని కలుపుతారు కాబట్టి  మీ కడుపులో చాలా క్యాలరీలు సులువుగా చేరుతాయి.
 

66

 ఎంత వీలైతే అంత బయట తినడాన్ని తగ్గించండి. అలాగే జంక్ ఫుడ్ ని కూడా మీ దరిదాపుల్లోకి రానివ్వకండి. ఆకుకూరలకి ఎక్కువ ప్రాధాన్యతని ఇవ్వండి. దీని వలన త్వరగా వెయిట్ లెస్ అవ్వటానికి బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి అవకాశం ఉంటుంది.

click me!

Recommended Stories