Health Tips: గొంతు నొప్పికి చక్కని ఔషధం.. ఒకసారి ఇలా ట్రై చేస్తే ఫలితం తప్పనిసరి?

Published : Aug 08, 2023, 01:29 PM IST

Health Tips: ఆపిల్ సైడర్ వెనిగర్ గురించి చాలామందికి తెలియదు ఇది కేవలం గొంతు నొప్పిని కాదు చాలా ఆరోగ్య సమస్యలకు చక్కని ఔషధంలా పనిచేస్తుంది. అయితే గొంతు నొప్పికి ఈ వెనిగర్ ఎలా పనిచేస్తుందో చూద్దాం.  

PREV
16
Health Tips: గొంతు నొప్పికి చక్కని ఔషధం.. ఒకసారి ఇలా ట్రై చేస్తే ఫలితం తప్పనిసరి?

సాధారణంగా సీజన్ మారితే మొదటగా వచ్చేది త్రోట్ ఇన్ఫెక్షన్. దీనివలన వచ్చే ఇబ్బంది భరించలేనిదిగా ఉంటుంది. ఏమి తాగలేము, తినలేము. ఇది తరచూ మారుతున్న వాతావరణం వల్ల వస్తుంది. ఈ ఆరోగ్య సమస్యను అధిగమించడానికి ఆపిల్ సైడర్ వెనిగర్ ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం.
 

26

ముందుగా ఒక టేబుల్ స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ ని పెద్ద గ్లాసు గోరువెచ్చని నీటిలోని కలుపుకొని రోజుకు ఒకసారి తాగటం వలన గొంతు నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. అలాగే దాల్చిన చెక్క ఇతర వంటగది పదార్థాలతో కలిపి ఆపిల్ సైడర్ వెనిగర్ కలిపి ఒక కప్పు వెచ్చని నీటిలో..

36

ఒక టేబుల్ స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్, ఒక టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క,ఒక టేబుల్ స్పూన్ తేనె, ఒక టేబుల్ స్పూన్ నిమ్మకాయ రసం కలపాలి. ఇలా చేసుకున్న కషాయాన్ని తాగవచ్చు లేదంటే గార్గిలింగ్   కూడా చేయవచ్చు.
 

46

అలాగే గొంతు నొప్పికి ఉప్పు నీటితో పుక్కిలించడం అనేది ఎప్పటినుంచో వస్తున్న రెమిడి. ఆ ఉప్పు నీటిలో కొంచెం ఆపిల్ సైడర్ వెనిగర్ ని కలపటం వలన మరింత ఉపయోగం చేకూరుతుంది. ఆపిల్ స్పైడర్  వెనిగర్ లో చాలా విటమిన్లు, ఎంజైములు,  ప్రోటీన్లు ప్రయోజనకరమైన బ్యాక్టీరియాలో ఉంటాయి.
 

56

 అలాగే ఒక గ్లాసు వెచ్చని నీటిని తీసుకొని దానిలో ఒక టేబుల్ స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ ని కలపండి. తర్వాత రెండు టేబుల్ స్పూన్ల తేనె జోడించండి. ఈ మిశ్రమాన్ని రోజుకి ఒకసారి తాగండి దీనివలన గొంతు నొప్పి తగ్గటంతో పాటు దగ్గుతో పోరాటానికి కూడా సహాయపడుతుంది.

66

ఈ ఆపిల్ సైడర్ వెనిగర్ కేవలం గొంతు నొప్పిని తగ్గించడానికి కాకుండా బరువు తగ్గటానికి మరియు డయాబెటిక్ రోగులకు కూడా ఎంతో మంచిది ఎందుకంటే రక్తంలో ఉండే షుగర్ లెవెల్స్ ని తగ్గించడంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.

click me!

Recommended Stories