ఉదయాన్నే ఖాళీ కడుపుతో అరటి పండును తింటున్నారా.. అయితే జాగ్రత్త!

Published : May 17, 2022, 02:34 PM IST

అరటి పండులో (Banana) ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఉత్తమమైన ఫలితాలను అందిస్తాయి.  

PREV
18
ఉదయాన్నే ఖాళీ కడుపుతో అరటి పండును తింటున్నారా.. అయితే జాగ్రత్త!

ఉదయాన్నే ఖాళీకడుపుతో అల్పాహారంగా అరటి పండ్లను తీసుకోవడం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఇలా ఖాళీ కడుపుతో ఉదయాన్నే అల్పాహారంగా (Breakfast) అరటి పండ్లను తీసుకుంటే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

28

నేటి ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మంది ఉదయాన్నే తీసుకొనే అల్పాహారం విషయంలో అశ్రద్ధ (Careless) చేస్తున్నారు. ఉదయాన్నే తీసుకునే అల్పాహారం శరీరంలోని మినరల్స్ స్థాయిని సమతుల్య పరిచి, శరీరాన్ని ఆరోగ్యంగా (Healthy) ఉంచేందుకు సహాయపడుతుంది.కానీ చాలా మంది ఉదయం అల్పాహారానికి బదులుగా అరటి పండుతో సరిపెట్టుకుంటున్నారు.
 

38

ఇలా ఉదయాన్నే ఖాళీకడుపుతో అల్పాహారంగా  అరటి పండ్లను తీసుకుంటే ఇందులో ఉండే  పొటాషియం (Potassium), మెగ్నీషియం (Magnesium) శరీరంలోని మినరల్స్ స్థాయిని అసమతుల్యత పరిచి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి.కనుక ఉదయాన్నే ఖాళీ కడుపుతో అరటిపండ్లను తినకపోవడమే మంచిది. అరటి పండు ఆరోగ్యానికి మంచిది.
 

48

ఇందులో ఉండే పోషకాలు జీర్ణాశయం, మలబద్దకంలతో (Constipation) పాటు కడుపులో అల్సర్ సమస్యలను తగ్గిస్తాయి. అలాగే రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచి రక్తహీనత సమస్యలను తగ్గించడంలో సహాయపడుతాయి. అంతే కాకుండా గుండె ఆరోగ్యాన్ని (Heart Health) మెరుగుపరచడంతో పాటు అధిక రక్తపోటు సమస్యలు కూడా తగ్గిస్తాయి.

58

అయితే ఇందులోని పోషక ప్రయోజనాలన్నీ శరీరానికి అందించాలంటే, సరైన సమయంలో అరటి పండ్లను తీసుకోవడం మంచిది. ఖాళీకడుపుతో (Empty stomach) అరటి పండును తీసుకుంటే అది కడుపులో ఆమ్లత్వానికి దారితీస్తుంది. దీంతో పేగు సంబంధిత సమస్యలు (Intestinal problems) తీవ్రమయ్యే అవకాశం ఉంటుంది.

68

అరటి పండులో ఆరోగ్యాన్ని మెరుగుపరిచే అనేక పోషకాలు ఉంటాయని అందరికీ తెలుసు. అందుకే చాలామంది అరటి పండును తినడానికి ఇష్టపడతారు. అయితే ఖాళీ కడుపుతో అరటి పండును తీసుకుంటే ఇందులో ఉండే ఎక్కువ మొత్తంలోని చక్కెర స్థాయిలు (Sugar levels) శరీరంలోని శక్తిని ప్రేరేపిస్తాయని (Stimulate energy) తాజా అధ్యయనంలో తేలింది.

78

దీంతో కొన్ని గంటల వ్యవధిలోనే శరీరం పొందిన శక్తి క్రమక్రమంగా తగ్గిపోయి శరీర చురుకుదనాన్ని (Agility) తగ్గిస్తుంది. దీంతో నిద్రావస్థ (Hibernation) అనుభూతి కలుగుతుంది. కనుక ఉదయాన్నే ఖాళీ కడుపుతో అరటి పండును తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది కాదు. అయితే అరటి పండులో ఉండే పోషకాలను శరీరానికి అందించడం కోసం అల్పాహార భోజనంతో కలిపి తీసుకుంటే మంచిది.
 

88

ఇలా చేస్తే శరీరంలో మినరల్స్ స్థాయిలు సమతుల్యంగా ఉంటాయి. అలాగే కడుపులో ఆమ్లత్వ సమస్యలు (Acidity problems) కూడా తగ్గుతాయి. దీంతో పేగు సంబంధిత సమస్యలు (Intestinal problems) దరిచేరవు. కనుక సరైన సమయంలో అరటి పండ్లను తీసుకుంటే ఇందులోని పోషకాలు శరీరానికి అందుతాయి. ఎటువంటి పౌష్టిక ఆహారమైన సరైన సమయంలోనే తీసుకుంటే వాటి ఫలితాలు శరీరానికి పుష్కలంగా లభిస్తాయి.. కనుక సరైన సమయంలో అరటి పండ్లను తీసుకోండి.. ఆరోగ్యంగా ఉండండి..

click me!

Recommended Stories