చిన్న వయసులోనే కీళ్ల నొప్పులు వేదిస్తున్నాయా.. అయితే ఇవి తినండి!

Published : May 16, 2022, 04:06 PM IST

వయసు పైబడటంతో కీళ్లు బలహీనంగా మారి నొప్పిని కలిగిస్తాయి. అయితే వయసు పైబడిన వారు మాత్రమే కాదు..  

PREV
110
చిన్న వయసులోనే కీళ్ల నొప్పులు వేదిస్తున్నాయా.. అయితే ఇవి తినండి!

యుక్త వయసు వారు కూడా కీళ్ల నొప్పులతో (Arthritis) సతమతమవుతున్నారు. దీనికి కారణం వారు తీసుకునే ఆహారంలో పోషకాహార లోపమే (Malnutrition).. కనుక మన రోజువారీ జీవనశైలిలో కొన్ని ఆహార పదార్థాలను భాగంగా చేసుకుందాం.. మరి అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
 

210

కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం కోసం బయట మార్కెట్లో అందుబాటులో ఉండే మందులకు బదులుగా తీసుకునే ఆహారంలో కొన్ని పదార్థాలను చేర్చుకుంటే మంచి ఫలితం ఉంటుంది. కనుక తీసుకునే ఆహారం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ అందులో యాంటీ ఆక్సిడెంట్లు (Antioxidants), ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు (Omega-3 fatty acids) అధికంగా ఉండే ఆహార పదార్థాలు ఉండేలా చూసుకోవాలి.
 

310

పసుపు, పాలు: కీళ్ల నొప్పులతో బాధపడేవారు ప్రతిరోజూ పసుపు (Turmeric) కలిపిన పాలను (Milk) తీసుకోవడం మంచిది. పసుపులో యాంటి ఇన్ఫ్లమేటరీ, యాంటీ సెప్టిక్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి కీళ్లనొప్పుల నుంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి.
 

410

బ్లూబెర్రీలు: బ్లూబెర్రీలలో (Blueberries) కీళ్ల నొప్పి నుంచి ఉపశమనాన్ని కలిగించే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర రోగనిరోధక శక్తిని (Immunity) పెంచి కీళ్ల నొప్పులు, వాపులను తగ్గిస్తాయి. కనుక తరచూ బ్లూబెర్రీలను తీసుకోవడం మంచిది.
 

510

నారింజ పండు: నారింజ (Orange) పండులో విటమిన్ సి (Vitamin C), యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కీళ్ల నొప్పులు, వాపుల నుంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి. కనుక ఈ పండును తీసుకుంటే కీళ్ల నొప్పులు, వాపులు తగ్గుతాయి.
 

610

పుచ్చకాయ: పుచ్చకాయలో (Watermelon) యాంటీఇన్ఫ్లమేటరీ (Antiinflammatory), కెరొటినాయిడ్ బీటా- క్రిప్టోసంతిన్ గుణాలు ఉంటాయి. ఇవి ఎముకలను దృఢంగా చేసి కీళ్లనొప్పులు, వాపు వంటి సమస్యల నుంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి.
 

710

ద్రాక్ష: ప్రతిరోజూ ద్రాక్షను (Grapes) తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ద్రాక్ష పండులో రెస్వేరాట్రాల్ (Resveratrol) అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఆర్థరైటిస్ నొప్పిలను తగ్గిస్తాయి. కనుక కీళ్ల నొప్పులు ఉన్నవారు ద్రాక్షను తీసుకోవడం మంచిది.
 

810

చేపలు: చేపలలో (Fish) ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇవి కీళ్ల నొప్పులను తగ్గించడానికి సహాయపడుతాయి. అంతేకాకుండా శరీరంలో ఉండే వాపులను (Inflammation) కూడా తగ్గిస్తాయి. కనుక వారంలో రెండు మూడు సార్లు చేపలను తీసుకోండి.
 

910

రాగులు, జొన్నలు, సజ్జలు: రాగులు, జొన్నలు (Sorghum), సజ్జలు శరీరానికి శక్తినందించే మంచిగా పోషక పదార్థాలు (Nutrients). వీటిని తీసుకుంటే ఎముకలు దృఢంగా మారి కీళ్లనొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది. కనుక తీసుకునే ఆహారంలో ఈ పదార్థాలు ఉండేలా చూసుకోవాలి.
 

1010

అలాగే వీటితోపాటు కాలానుగుణంగా అందుబాటులో ఉండే అన్ని రకాల పండ్లు (Fruits), కూరగాయలను (Vegetables) ఎక్కువగా తీసుకోవాలి. ఈ ఆహార పదార్థాలతో పాటు చేయదగిన చిన్న చిన్న వ్యాయామాలను చేయడం మంచిది.

click me!

Recommended Stories