మిగిలిపోయిన అన్నాన్ని తినొచ్చా?

First Published | Feb 14, 2024, 10:28 AM IST

మన దేశంలో మూడు పూటలా అన్నాన్ని తినేవారు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే అన్నం కడుపు నింపడమే కాదు మనల్నిశక్తివంతంగా కూడా ఉంచుతుంది. అయితే చాలా సార్లు అన్నం మిగిలిపోతూ ఉంటుంది. దాన్ని ఫ్రిజ్ లో పెట్టి తినే వారు ఉన్నారు. లేదంటే మళ్లీ వేడి చేసి తింటుంటారు. కానీ ఇలా తింటే ఏమౌతుందో తెలుసా? 
 

బియ్యం మన రోజువారి ఆహారంలో ఒక ముఖ్యమైన భాగం. అన్నం లేకుండా మన రోజువారి ఆహారం అసంపూర్ణంగా ఉండదు. అందుకే మనలో చాలా మంది ఉదయం, మధ్యాహ్నం, రాత్రి అంటూ మూడు పూటలా అన్నాన్నే తింటారు. ఆ పూటకు మిగిలిపోయిన అన్నాన్ని వేరే పూటకు తింటుంటారు. అయితే ఇలా మిగిలిపోయిన అన్నాన్ని వేడి చేసి తినే అలవాటు కూడా చాలా మందికి ఉంటుంది. కానీ మిగిలిపోయిన అన్నాన్ని వేడి చేసి తినడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

rice

మిగిలిపోయిన అన్నాన్ని వేడి చేసి తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్, ప్రమాదకరమైన జీర్ణశయాంతర సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.  అవును మిగిలిపోయిన అన్నాన్ని ఫ్రిజ్ లో పెట్టడం, తినేటప్పుడు వేడి చేయడం వంటివి అస్సలు మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.

Latest Videos


rice

మిగిలిపోయిన అన్నం తినొద్దా? 

కొన్నికొన్ని సార్లు మిగిలిపోయిన అన్నాన్ని తినడం హానికరమంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే వండిన అన్నంలో ఉండే తేమ ఉంటుంది. దీంతో అన్నంలో బ్యాక్టీరియా ఫాస్ట్ గా పెరుగుతుంది. ముఖ్యంగా వెచ్చని ఉష్ణోగ్రతలలో. అన్నం, పాస్తా వంటి పిండి ధాన్యాలు ఫుడ్ పాయిజనింగ్ కు గురికావడానికి బాసిల్లస్ సెరియస్ అనే బ్యాక్టీరియానే కారణం. అన్నం వండిన తర్వాత ఎక్కువ సేపు గది ఉష్ణోగ్రతలో ఉంచి ఫ్రిజ్ లో పెట్టకుండా ఉంచితే ఈ బ్యాక్టీరియా చాలా వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉంది. ఇలాంటి అన్ని తింటే ఈ సమస్యలు వస్తాయి. 

లూజ్ మోషన్
వాంతులు
నిర్జలీకరణం

rice

తిరిగి వేడి చేసి తినడం ఎంత సురక్షితం?

రైస్ మాత్రమే కాదు బియ్యం వండిన ఏ ఆహార పదార్ధమైనా సూక్ష్మజీవుల పెరుగుదలకు అనుకూలంగా ఉంటుంది. అయితే ఈ బ్యాక్టీరియా ఎంతవరకు అభివృద్ధి చెందుతుంది అనేది ఆహార రకంపై ఆధారపడి ఉంటుంది. బ్యాక్టీరియా పెరుగుదల గది ఉష్ణోగ్రత వద్ద బాగా పెరుగుతుంది. ఎందుకంటే సూక్ష్మక్రిములు 37 డిగ్రీల సెల్సియస్ వద్ద బాగా పెరుగుతాయి.
 

rice

ఆహారంలో తక్కువ మొత్తంలో సూక్ష్మక్రిములు ఉంటే ఎక్కువ సమస్యలు రావు. కానీ బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నవారికి, వృద్ధులు, గర్భిణీ స్త్రీలు, జిఐ సమస్యలు లేదా సున్నితత్వం ఉన్నవారు మిగిలిపోయిన అన్నాన్ని తింటే సమస్యలను ఖచ్చితంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే వీరు మిగిలిన అన్నాన్ని తినకపోవడమే మంచిది. 

ఫ్రిజ్ లో అన్నం తినడం సురక్షితమేనా?

అన్నాన్ని సరైన సమయంలో సరిగ్గా వేడి చేయడం,  శీతలీకరించడం సురక్షితం. దానిని సరైన ఉష్ణోగ్రతకు తిరిగి వేడి చేయడం కూడా చాలా ముఖ్యం. వండిన ఆహారాన్ని గది ఉష్ణోగ్రత వద్ద ఎక్కువసేపు ఉంచిన తర్వాత తిరిగి వేడి చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. అందుకే ఆహారాన్ని వేడి చేస్తే సరిపోదు. ఆహారాన్ని కనీసం 160 డిగ్రీల సెల్సియస్ వరకు తిరిగి వేడి చేయాలి. అలాగే ఆహారాన్ని ఫ్రిజ్లో ఉంచడం, మళ్లీ మళ్లీ వేడి చేసి తినడం మానుకోండి. 

click me!