హెల్తి డైట్ - న్యూట్రిషన్ అండ్ హెల్త్ .. అకాడమీ అఫ్ న్యూట్రిషన్ అండ్ డియాబెటిక్స్.. 2020. ఇది కేవలం రుజువు కోసం . ఇలాంటి పరిశోధనలు వందల్లో . ప్రతి మెడికల్ బుక్ లో ఇవి ఉంటాయి . ఇలా వాగిన వారు... ఎవడు చూస్తాడులే అని బరితెగించిన రకం .. లేదా ప్రైవేట్ మెడికల్ కాలేజీలో కాపీ కొట్టి పాస్ అయ్యిన రకం... అయ్యి ఉండాలి. చివరిగా ఒక మాట .
మెడికల్ కౌన్సిల్ అధ్యక్షుడు కొన్ని రోజుల క్రితం చెప్పిన మాట .. మన దేశం లో ఇప్పుడు నిజమైయైన డాక్టర్స్ తగ్గిపోతున్నారు. స్టార్ ఆసుపత్రుల ఏజెంట్స్ గా చాల మంది డాక్టర్స్ మారిపోతున్నారు.
ప్రసార మాధ్యమాల్లో స్టార్ ఆసుపత్రుల సారథ్యంలో ప్రసారమయ్యే వాటిలో నూటికి తొంబై శాతం వక్రీకరణలు .. అర్ధ సత్యాలు .. అశ్వత్థామ అథః కుంజరః .. టైప్‌లో ఉంటాయి. జనాల్లో పెరుగుతున్న ఆరోగ్య స్పృహను చంపడం .. అనారోగ్య పద్ధతులను అలవాటు చెయ్యడం.. భయపెట్టి టెస్ట్‌లు చేసుకొనేందుకు ఆసుపత్రులకు రప్పించుకోవడం.. వచ్చాక వామ్మో నీకు ఇదిగో షుగర్ 142 వుంది .. 140 దాటితే చస్తావు ఇదిగో రోజుకు యాభై మాత్రలు మింగు అని చెప్పి ఆ బకరాను శాశ్వత ఏటీఎంగా మార్చుకోవడం. ఇదీ నడుస్తున్న చరిత్ర. ఎక్కడో ఒక్కరో ఇద్దరో నిజాయితీ డాక్టర్స్ ఉన్నారు.. వారికి క్షమాపణలతో ..
అమర్‌నాథ్ వాసిరెడ్డి ఫేస్‌బుక్ పోస్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..