సులభంగా బరువు తగ్గాలా..? ఈ యోగాసనాలు ట్రై చేయండి..!

First Published Aug 27, 2021, 12:24 PM IST

ఈ బరువును తగ్గించుకోవడానికి చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ బరువు తగ్గలేకపోతున్నారు. అలాంటివారు.. యోగాలో ఈ మూడు భంగిమలు ప్రయత్నిస్తే.. సులభంగా బరువు తగ్గొచ్చు.
 

యోగా ఆరోగ్యానికి చాలా మంచిది అనే విషయం మనకు తెలుసు. అయితే.. యోగా చేస్తే బరువు తగ్గరని చాలా మంది అనుకుంటారు. అందులో ఏ మాత్రం నిజం లేదని నిపుణులు చెబుతున్నారు.  యోగా చేసినా కూడా సులభంగా బరువు తగ్గవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.  ఎలాంటి ఆసనాలు వేయడం వల్ల సులభంగా బరువు తగ్గవచ్చో.. నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు  చూద్దాం..

కరోనా మహమ్మారి మన జీవన శైలి పూర్తిగా మార్చేసింది. చాలా మంది ఇళ్లల్లో ఉండి బరువు పెరుగు పెరిగిపోయారు. ఈ బరువును తగ్గించుకోవడానికి చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ బరువు తగ్గలేకపోతున్నారు. అలాంటివారు.. యోగాలో ఈ మూడు భంగిమలు ప్రయత్నిస్తే.. సులభంగా బరువు తగ్గొచ్చు.

నౌకాసన( బోట్ ఫోస్).. ఈ ఆసనం ద్వారా సులభంగా బరువు తగ్గవచ్చు. దీనికోసం ముందుగా.. యోగా మ్యాట్ మీద కూర్చోవాలి. తర్వాత రెండు చేతులను ముందుకు చాపాలి. తర్వాత.. రెండు కాళ్లను 45 డిగ్రీల పైకి ఎత్తాలి. దీనిని నౌకాసన లేదా బోట్ ఫోస్ అంటారు. దీనిని ఇలా ప్రతిరోజూ 10సార్లు రిపీట్ చేయాలి. ఇలా రోజూ చేయడం వల్ల.. బరువు తగ్గే అవకాశం ఉంటుంది.

నౌకాసన( బోట్ ఫోస్)..
ఈ ఆసనం ద్వారా సులభంగా బరువు తగ్గవచ్చు.  దీనికోసం ముందుగా.. యోగా మ్యాట్ మీద కూర్చోవాలి.  తర్వాత రెండు చేతులను ముందుకు చాపాలి. తర్వాత.. రెండు కాళ్లను 45 డిగ్రీల పైకి ఎత్తాలి. దీనిని నౌకాసన లేదా బోట్ ఫోస్ అంటారు. దీనిని ఇలా ప్రతిరోజూ 10సార్లు రిపీట్ చేయాలి. ఇలా రోజూ చేయడం వల్ల.. బరువు తగ్గే అవకాశం ఉంటుంది.
 

త్రికోనాసన(ట్రయాంగిల్ ఫోస్)

ఈ ఆసనాన్ని యోగా మ్యాట్ పై నిలపడి చేయాల్సి ఉంటుంది. రెండు కాళ్లను దూరంగా స్ట్రెచ్ చేయాలి. ఆ తర్వాత.. ఒక పక్కకు వంగి.. త్రిభుజ కోణంలో నిలపడాలి. అలా రెండు వైపులా చేయాల్సి ఉంటుంది. ఇలా 30 సెకన్ల పాటు.. ప్రతిరోజూ పది సార్లు రిపీట్ చేయాలి.  

Plank

చతురంగ దండాసన

దీనినే ప్లాంక్ ఫోస్ అని కూడా చెబుతుంటారు. నేల మీద పడుకొని..ఆ తర్వాత శరీరం మొత్తం పైకి లేపాలి. అర చేతుల మీద శరీరం మొత్తాన్ని పైకి లేపాలి. ఇలా చేయడం వల్ల కూడా సులభంగా బరువు తగ్గొచ్చు. 

click me!