చిటికెడు పసుపు... ఎన్ని ప్రయోజనాలో..!

First Published Aug 19, 2021, 11:47 AM IST

తాత్కాలిక వ్యాధులు మాత్రమే కాదు.. క్యాన్సర్, గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించడంలోనూ ఇది కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఎన్నో పరిశోధనల్లో ఈ విషయం నిరూపితమైంది.

భారతీయ వంటకాల్లో పసుపు కీలక పాత్ర పోషిస్తుంది.  చాలా మంది పసుపు లేకుండా.. అసలు వంట కూడా చేయరు. దీనిని వంటలో చేర్చడం వల్ల మంచి రుచి, రంగు, వాసన అందిస్తుంది. ఈ పసుపులో యాంటీ ఆక్సిడెంట్  లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి అనారోగ్యాలను దూరం చేయడంతోపాటు.. దీర్ఘకాలిక సమస్యలను కూడా తగ్గిస్తుంది.
 

పసుపు ఒక మసాలా దినుసు. కాగా.. ఇది ఇతర మసాలా దినుసులు మాదిరిగా కాకుండా దీని వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అనేక దశాబ్దాలుగా పసుపుని ఔషధంగా వినియోగిస్తూ వస్తున్నారు. శరీరంలోని ట్యాక్సిన్స్ ని బయటకు తీయడానికి ఇది సహాయం చేస్తుంది.
 

కరోనా మహమ్మారి నుంచి పోరాడటానికి కూడా ఇది సహాయం చేస్తుంది. జలుబు, దగ్గు వంటి వ్యాధుల నుంచి బయటపడటానికి కూడా సహాయం చేస్తుంది. ప్రతిరోజూ పసుపుటీని తాగడం లేదా.. పాలల్లో చిటికెడు పసుపు వేసుకొని తాగడం వల్ల అద్భుత ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. వైరల్ ఇన్ఫెక్షన్ల వల్ల కలిగే ప్రమాదాల నుంచి కూడా ఇది దూరం చేస్తుంది.

తాత్కాలిక వ్యాధులు మాత్రమే కాదు.. క్యాన్సర్, గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించడంలోనూ ఇది కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఎన్నో పరిశోధనల్లో ఈ విషయం నిరూపితమైంది.

ప్రపంచవ్యాప్తంగా నమోదౌతున్న మరణాల్లో ఎక్కువ శాతం గుండె జబ్బు కారణంగానే జరుగుతోందనే విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కాగా.. ఆ గుండె జబ్బుని తగ్గించే ఔషధం పసుపులో ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు.
 

పసుపులో ఉండే కర్కుమిన్ అనే ఔషధం క్యాన్సర్ ని కూడా తగ్గించగలదట. క్యాన్సర్ కారకాలపై , వాటి అభివృద్ధిపై వీటి ప్రభావం చూపుతుందట. క్యాన్సర్ కారకాలను పూర్తిగా నివారించకపోయినా.. వాటి పెరుగుదలను మాత్రం కంట్రోల్ చేసే శక్తి వాటిలో ఉంటుందట.

రక్తంలోని చెక్కర స్థాయిని కూడా కంట్రోల్ చేస్తుంది. టైప్ 2 డయాబెటిస్ ని అదుపుచేయడానికి కూడా పసుపు సహాయం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
 

అంతేకాకుండా..  అల్జీమర్స్ వ్యాధి నుంచి కూడా రక్షిస్తుందట. అల్జీమర్స్ సోకిన వారు.. ప్రతి విషయాన్ని మరచిపోతారు. అయితే.. ఈ పసుపు తీసుకోవడం వల్ల అల్జీమర్స్ దరిచేరకుండా సహాయం చేస్తుందట.

ఇవి మాత్రమే కాకుండా కీళ్ల నొప్పులను కూడా ఇది తగ్గిస్తుంది. కీళ్ల నొప్పుల సమస్య నుంచి బయటపడటానికి ఇది ఎంతగానో సహాయం చేస్తేంది.

click me!