Health Tips: మనలో చాలామంది అరటిపండు మీద చిన్న మచ్చ పడినా కూడా తినటానికి ఇష్టపడరు పైగా పిసికిపోయింది అనుకొని బయట పడేస్తారు. కానీ అలా చేయకండి అందులో కూడా ఆశ్చర్యపరిచే పోషక విలువలు ఉన్నాయి. అవేంటో చూద్దాం.
అరటిపండు పై మచ్చలు వచ్చినప్పుడు దానిని తినటానికి ఇష్టపడరు సరి కదా పైన పారేయడానికి సిద్ధపడతారు. కానీ అలా చేయకండి అరటిపండు బాగా పండిన తర్వాత కూడా దానిలో పొటాషియం, మాంగనీస్, ఫైబర్, రాగి, విటమిన్ సి మరియు బయోటిన్ సమృద్ధిగా ఉంటాయి.
26
a
ఇవి ఆస్తమా, క్యాన్సర్, అధిక రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలను నిరోధించడానికి సహాయపడుతుంది. ఇందులో రక్తపోటుని తగ్గించడంలో సహాయపడే పొటాషియం నిల్వలు అధికంగా ఉంటాయి. అలాగే వీటిని తినటం వలన రక్త ప్రవాహం మెరుగుపడుతుంది.
36
బాగా పక్వానికి వచ్చిన అరటిపండు ఉత్తమమైన యాంటిసిడ్ పనిచేస్తుంది. ఇది గుండె మంటని తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే ఇలాంటి అరటిపండ్లలో ఐరన్ అధికంగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అనీమియా సమస్యని నివారిస్తుంది.
46
అలాగే ఇందులో ఉండే కార్బోహైడ్రేట్స్ మరియు షుగర్ కంటెంట్ సహజసిద్ధమైన ఎనర్జీ బూస్టర్ వల్లే పని చేస్తాయి. క్రమంగా శరీరక శక్తి స్థాయిలు మెరుగవుతాయి. మీకు సడన్ గా నీరసం ఆవహించినట్లయితే వెంటనే ఒకటి లేదా రెండు బాగా మగ్గిన అరటి పండ్లను తీసుకోవడం వల్ల సత్వర ఉపశమనం లభిస్తుంది.
56
అలాగే ఇందులో ఉండే మరొక ముఖ్యమైన లక్షణం క్యాన్సర్ తో పోరాడే సామర్థ్యం. అరటిపండు చర్మం పై కనిపించే ముదురు రంగు మచ్చలు ట్యూమర్ నెక్రోసిస్ ఫ్యాక్టర్ ఏర్పాటు చేస్తాయి. ఇవి క్యాన్సర్ కణాలని చంపే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. అలాగే ఈ అరటి పళ్ళు అల్సర్ సమస్యని తగ్గించడంలో బాగా ఉపయోగపడుతుంది.
66
ఈ పళ్ళలో ఉన్న మృదుత్వం కారణంగా కడుపులో పేగు వ్యవస్థ సవ్యంగా జరిగేలాగా చూస్తూ అల్సర్ నుంచి యాసిడ్లు ఉత్పత్తి కాకుండా నిరోధిస్తుంది. మలబద్ధకానికి మంచి ఔషధం బాగా మగ్గిన అరటి పండ్లు. ఇది మీ జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది. అయితే ఇన్ని మంచి లక్షణాలు ఉన్న ఈ అరటిపండు ని డయాబెటిక్ పేషంట్లకి దూరంగా ఉంచితే మంచిది.