డయాబెటిస్ ఉన్న మహిళలకు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు, యోని ఈస్ట్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా అంధత్వం, మూత్రపిండాల వ్యాధి, నిరాశ వంటి సమస్యలు కూడా డయాబెటిస్ వల్ల వస్తాయని నిపుణులు చెబుతున్నారు.
మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజురోజుకూ బాగా పెరిగిపోతోంది. డయాబెటిస్ వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోతాయి. ఈ సమస్యను తేలిగ్గా తీసిపారేయడానికి లేదు. ఎందుకంటే ఇది దీర్ఘకాలిక వ్యాధి. ఈ వ్యాధి ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మందిని ప్రభావితం చేస్తోంది. డయాబెటిస్ ను నియంత్రించడంలో మందులు కీలక పాత్ర పోషిస్తాయి. అయినప్పటికీ.. బ్లడ్ షుగర్ లెవెల్స్ ను కొన్ని జీవన శైలి అలవాట్ల వల్ల కూడా నియంత్రించొచ్చు.
27
diabetes diet
అయితే డయాబెటీస్ అందరికీ వస్తుంది. కానీ ఇది మహిళల ఆరోగ్యంపై ఎంతో ప్రభావం చూపుతుందని నిపుణులు అంటున్నారు. మహిళల మొత్తం ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అనియంత్రిత మధుమేహం తీవ్రమైన అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు.
37
డయాబెటిస్ మహిళల్లో గుండె జబ్బుల ప్రమాదాన్ని దాదాపుగా నాలుగు రెట్లు పెంచుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. కానీ డయాబెటీస్ వల్ల పురుషులకు గుండె జబ్బులు వచ్చే అవకాశం కేవలం రెండు రెట్లే. డయాబెటిస్ ఉన్న మహిళల్లో మూడింట రెండువంతుల మంది హృదయ సంబంధ వ్యాధులతో మరణిస్తున్నారని నిపుణులు చెబుతున్నారు.
47
diabetes diet
డయాబెటిస్ లేని మహిళల కంటే డయాబెటిస్ ఉన్న మహిళలకు రుతువిరతి తర్వాత గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. డయాబెటిస్ ఉన్న మహిళలకు అధిక-సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ అంటే మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు తక్కువగా ఉంటాయి. అలాగే ట్రైగ్లిజరైడ్స్ లేదా చెడు కొలెస్ట్రాల్, కొవ్వులు మాత్రం వీరి శరీరంలో ఎక్కువగా పేరుకుపోతాయి.
57
డయాబెటిస్ ఉన్న మహిళలకు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు, యోని ఈస్ట్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వస్తాయి. అలాగే అంధత్వం, మూత్రపిండాల వ్యాధి, నిరాశ వంటి డయాబెటిస్ తో సంబంధం ఉన్న ఇతర సమస్యలు కూడా ఆడవారికి వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది.
67
diabetes
మీకు తెలుసా? డయాబెటిస్ ఉన్న మహిళలకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ సర్వ సాధారణం. ముఖ్యంగా వారి రక్తంలో గ్లూకోజ్ సరిగా అదుపులో లేకపోతే. మందులు, జీవనశైలి మార్పులు ఈ లక్షణాలను నియంత్రించడానికి, మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడతాయి.
77
diabetes diet
డయాబెటిస్ ను పూర్తిగా తగ్గించుకోలేనప్పటికీ.. దీనిని ఖచ్చితంగా నియంత్రించొచ్చు. సరైన ఆహారాలను తినడం, క్రమం తప్పకుండా శారీరక వ్యాయామాలను చేయడం వంటి కొన్ని జీవనశైలి మార్పుల ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచొచ్చు. అలాగే మంచి పోషకాహారాన్ని తినండి. పుష్కలంగా నీళ్లను తాగుతూ హైడ్రేట్ గా ఉండండి. ఈ మార్పులు గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడంలో ఎంతో సహాయపడతాయి.