Health Tips: వర్షాకాలంలో ఇన్ఫెక్షన్లు రాకుండా ఉండాలా.. అయితే కచ్చితంగా అరటిపండు తినాల్సిందే?

Published : Aug 18, 2023, 12:21 PM IST

Health Tips: చాలామంది వర్షాకాలంలో అరటిపండు తినటానికి ఇష్టపడరు ఎందుకంటే జలుబు చేస్తుందని ఒక అపోహ. కానీ అరటిపండుని వర్షాకాలంలో కూడా తినొచ్చు. వర్షాకాలంలో అరటిపండును తినటం వల్ల వచ్చే లాభాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.  

PREV
16
Health Tips: వర్షాకాలంలో ఇన్ఫెక్షన్లు రాకుండా ఉండాలా.. అయితే కచ్చితంగా అరటిపండు తినాల్సిందే?

 ఏ సీజన్ లో అయినా లభించే అరటిపండుని ఈ  వర్షాకాలంలో తినటం చాలా మంచిది. వర్షాకాలంలో ఎక్కువగా జీర్ణ సమస్యలు వస్తాయి. అందుకే వాటిని దూరం చేసే అనేక ఖనిజాలు విటమిన్స్ తో నిండి ఉన్న అరటి పండ్లని వర్షాకాలంలో తీసుకోవటం చాలా అవసరం. ఇందులో ఉండే ఆస్కార్బిక్ యాసిడ్, రొటీనోల్ పుష్కలంగా ఉంటాయి.

26

ఇవి మన ఇమ్యూనిటీని పెంచుతాయి. అంతేకాకుండా అరటిపండ్లలో తక్కువ క్యాలరీలు ఉంటాయి. వీటిని తినడం వల్ల కడుపు ఎక్కువసేపు నిండిన అనుభూతిని పొందుతారు. అలాగే అరటి పండ్లలో ఉండే విటమిన్ బి6, విటమిన్ సి, ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం, ఎమైనా ఆమ్లాలు మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.
 

36

 వర్షాకాలంలో వచ్చే దగ్గు, ఆస్తమా వంటి సమస్యలని అరటిపండు తినటం ద్వారా  దూరం పెట్టవచ్చు. అయితే చాలామంది వర్షాకాలంలో తినొచ్చా లేదా అని అనుమాన పడుతూ అరటిపండుని దూరం పెడతారు. కానీ వర్షాకాలంలో అరటిపండు తీసుకోవడం అనేది చాలా ముఖ్యం అంటున్నారు నిపుణులు.
 

46

ఎందుకంటే అరటి పండులో ఉండే ఆమ్లాలు బ్రెయిన్ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. సీజనల్ వ్యాధులు రాకుండా అరటిపండు కాపాడుతుంది. స్ట్రోక్ రిస్క్ ని తగ్గించడానికి అరటిపండు సాయం చేస్తుంది. అయితే అరటిపండుని ఖాళీ కడుపుతో తినకూడదు.

56

 అలాగే ఆస్తమా, దగ్గు సమస్యలతో బాధపడే వాళ్ళు రాత్రిపూట అరటిపండుని తీసుకోకండి. అలాగే అరటి పండ్లను పాలతో కానీ పాల పదార్థాలతో కానీ తీసుకుంటే విషంతో సమానమని ఆయుర్వేదం చెబుతుంది. కాబట్టి ఆ కాంబినేషన్ తో అరటిపండుని తినకండి.
 

66
Image: Getty Images

అరటిపండ్లలో ఫైబర్ అధికంగా ఉండటం వలన మలబద్ధకానికి చెక్ పెట్టవచ్చు. అంతేకాకుండా ఒత్తిడిని తగ్గించుకోవడానికి కూడా అరటిపండు సహాయపడుతుంది. అలాగే మధుమేహ రోగులు అరటి పండ్లను ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది.

click me!

Recommended Stories