Published : Apr 10, 2025, 04:46 PM ISTUpdated : Apr 10, 2025, 04:52 PM IST
Dark Chocolate: పిల్లలు చాక్లెట్లు తింటానంటే ఏ తల్లిదండ్రులు ససేమిరా ఒప్పుకోరు. అయితే.. ఈ వార్తను అలాంటి తల్లిదండ్రులందరూ చదవాల్సిందే. చాక్లెట్ల వల్ల కలిగే నష్టాల గురించి ఇప్పటి వరకు పేరెంట్స్ తెలుసుకుని ఉంటారు. కానీ చాక్లెట్ల వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారండీ. ఈ వార్త చదివి అవేంటో మీతోపాటు.. మీ పేరెంట్స్‌కి కూడా చెప్పండి మరీ..
నేటి ఆధునిక ప్రపంచంలో ఒత్తిడి ప్రతి ఒక్కరి జీవితంలో సాధారణ అంశంగా మారింది. అయితే... అది ఓ లిమిట్‌లో ఉంటే సరే.. క్రమక్రమం ఒత్తిడి పెరిగితే.. మానసిక, శారీరక ఆరోగ్యంపై ప్రభావం చూపుతోంది. ఒత్తిడి తగ్గాలంటే వ్యాయామం చేయడం, జిమ్‌కి వెళ్లడం, వాకింగ్, యోగా, ధ్యానం ఇలా అనేక మార్గాలు ఉన్నాయి. వీటితోపాటు మీరు రోజుకొకటి ఆ రకం చాక్లెట్ తింటే ఒత్తిడి ఇట్టే తగ్గపోతుందని నిపుణులు చెబుతున్నారు. ఆయ్.... ఈ ఐడియా భలే ఉందనుకుంటున్నారు కదూ.. అయితే.. అన్ని రకాల చాక్‌లెట్లు ఆరోగ్యానికి మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. ఎలాంటివి ఎంపిక చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
25
chocolate will help to reduce the stress
చాక్లెట్ మానసిక ఒత్తిడిని తగ్గిస్తుందని ఇప్పటికే అనేక అధ్యయనాల్లో వెల్లడైందంట. అయితే.. డార్క్ చాక్లెట్ మాత్రమే తినాలని వైద్యులు చెబుతున్నారు. బయట ఏవి పడితే అవి దొరుకుతుంటాయి.. వాటిల్లో చక్కెర శాతం ఎక్కువగా, విటమిన్లు, మినరల్స్ తక్కువగా ఉంటాయని వాటిని తింటే అనారోగ్యంపాలు కావాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. షుగర్ కంటెంట్ అధికంగా ఉన్న చాక్లెట్లను తినడం వల్ల ఊబకాయం, మధుమేహం తదితర సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. మరి ఎలాంటివి ఎంపిక చేసుకోవాలంటే..
35
chocolate will help to reduce the stress
మన శరీరానికి ఒకరోజుకి 1600 నుంచి 2200 క్యాలరీలు మాత్రమే అవసరం ఉంటుంది. ఒక 100 గ్రాముల డార్క్ చాక్లెట్‌లో 600 గ్రాముల క్యాలరీలు ఉంటాయి. దీన్ని బట్టి డైట్‌ను ప్లాన్ చేసుకుంటూనే ఎంచక్కా చాక్లెట్లు తినేయవచ్చంట. అధికంగా చాక్లెట్లు తింటే బరువు పెరుగుతారని, ఊబకాయం వస్తుందని వైద్యులు సూచిస్తున్నారు. అందుకోసం మనం తినే చాక్లెట్ ఎంత పరిమాణంలో తింటున్నాం అన్నది చూసుకోవాలని చెబుతున్నారు. సాదా, డార్క్ చాక్లెట్ రెండింటిలోనూ ఒకే స్థాయిలో క్యాలరీలు ఉంటాయి. కాబట్టి ఇవి తినేటప్పుడు... మిగతా ఆహారంలో క్యాలరీలు తగ్గించుకోవాలని అంటున్నారు. లేదంటే బరువు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయంటున్నారు. ఏదైనా మితంగా తింటే మంచిది.
45
chocolate will help to reduce the stress
ఇక డార్క్ చాక్లెట్లను తీసుకోవడం వల్ల శరీరానికి యాంటీ ఆక్సిడెంట్లు, పాలీఫెనాల్స్, థియోబ్రోమిన్లు అధికంగా లభిస్తాయని ఇవి ఒత్తిడి తగ్గించి ఎండార్ఫిన్లు, సెరటోనిన్లను విడుదల చేసేందుకు దోహదపడతాయని వైద్యులు అంటున్నారు. డార్క్ చాక్లెట్లలో మెగ్నీషియం కూడా ఉండటంతో నాడీ వ్యవస్థను యాక్టివ్ చేస్తుందని అంటున్నారు. దీంతోపాటు మెగ్నీషియం నరాలు, కండరాల పనితీరు మెరుగ్గా ఉంచేందుకు సహకరిస్తుందని చెబుతున్నారు. వీటన్నింటి వల్ల ఒత్తిడితోపాటు, ఆందోళనా తగ్గుతుందని అంటున్నారు.
55
chocolate will help to reduce the stress
డార్క్ చాక్లెట్లతోపాటు.. కోకో డ్రింక్స్ ఒత్తిడి తగ్గించేందుకు దోహదపడతాయని అంటున్నారు. ఇందులో థియోబ్రోమిన్ వంటి బయోయాక్టివ్ సమ్మేళనాలు పుష్కలంగా ఉన్నాయని .. ఇవి ఒత్తిడి ఉపశమనానికి సహాయపడతాయంటున్నారు. మెదడు పనితీరును మెరుగుపరుస్తాయని అంటున్నారు. కోకో శాతం అధికంగా ఉండే డార్క్ చాక్లెట్ తినడం వల్ల మానసిక స్థితి, జ్ఞాపకశక్తి, రోగనిరోధక శక్తి మెరుగుపడతాయని అనేక అధ్యయనాల్లో తేలిందని వైద్యులు చెబుతున్నారు.