ల్యాప్ టాప్ ను ఒడిలో పెట్టుకుని పనిచేస్తే ఈ సమస్యలు తప్పవు.. జాగ్రత్త..!

First Published Dec 27, 2023, 1:38 PM IST

చాలా మంది ల్యాప్ టాప్ ఎక్కడపడితే అక్కడ పెట్టి పనిచేస్తుంటారు.నిజానికి ల్యాప్  టాప్ ఎక్కడపెట్టినా పనిచేస్తుంది. కానీ ఇది మంచి అలవాటు కాదు. ముఖ్యంగా దీన్ని ఒడిలో పెట్టుకుని పనిచేయడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలొస్తాయని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. 

Image: Getty

ప్రస్తుత కాలంలో ల్యాప్ టాప్ ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగమైపోయింది. ల్యాప్ టాప్ తో ఇంటి నుంచి పనిచేసే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. ఇది ఒక రకంగా మంచిదే. కానీ ఇది మీరు ఎలా వాడుతున్నారు అనే దానిపై ఉంటుంది. ఎందుకంటే చాలా మంది ల్యాప్ టాప్ ను ఒడిలో పెట్టుకుని వర్క్ చేస్తుంటారు. కానీ ఈ అలవాటు చాలా డేంజర్ అని ఎన్నో అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఇలా ఒడిలో పెట్టుకుని పనిచేయడం వల్ల ఎలాంటి సమస్యలొస్తాయో తెలుసుకుందాం పదండి.. 

పిల్లల్ని కనడం కష్టం

అవును.. ల్యాప్ టాప్ ను ఒడిలో పెట్టుకుని పనిచేసే ఆడవారు పిల్లల్ని కనడం కష్టమని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అలాగే ప్రెగ్నెన్సీ టైంలో.. ల్యాప్ టాప్ ను ఎక్కువగా ఉపయోగించడం వల్ల కూడా పుట్టబోయే బిడ్డపై ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా దీనికి దగ్గరగా ఉంటే..

వీర్యకణాల తగ్గింపు

చాలా మంది పురుషులు ల్యాప్ టాప్ ను ఒడిలో పెట్టుకునే ఎక్కువ పని చేస్తుంటారు. కానీ ఈ అలవాటు వల్ల వీరిలో వీర్యకణాల పెరుగుదల తగ్గుతుందట. అంటే ఇది వీర్యకణాల ఉత్పత్తిని తగ్గిస్తుందన్న మాట. ఇది సంతానోత్పత్తిని తగ్గిస్తుంది. అందుకే టేబుల్స్ పైనే వీటిని వాడండి. ఇందుకు వీలు కాకపోతే ల్యాప్ టాప్ షీల్డ్ వాడటం ఉత్తమం.

స్కిన్ క్యాన్సర్

ల్యాప్ టాప్ ను ఒడిలో పెట్టుకుని పనిచేయడం వల్ల స్కిన్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఎందుకంటే ఒడిలో ల్యాప్ టాప్ ను పెట్టడం వల్ల ఇది ప్రైవేటు భాగాలకు దగ్గరగా ఉంటుంది. దీంతో అక్కడ క్యాన్సర్  వచ్చే ప్రమాదం ఉంది. అందుకే ఇలా ల్యాప్ టాప్ ను ఒడిలో పెట్టుకోకూడదు. 
 

మెడ, వెన్నునొప్పి

ల్యాప్ టాప్ ను ఒడిలో పెట్టుకోవడం వల్ల ఎన్నో రకాల సమస్యలు వస్తాయి. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. ల్యాప్ టాప్ ను ఒడిలో పెట్టుకుని పనిచేయడం మంచిది కాదు. దీనివల్ల మెడ, వీపు భాగాలు వంగిపోతాయి. అలాగే విపరీతంగా నొప్పి కూడా వస్తుంది. ఇది దీర్ఘకాలిక నొప్పికి దారితీస్తుంది. 
 

laptop

రేడియేషన్

ల్యాప్ టాప్ లు ఎలక్ట్రోమోవియల్ ఎనర్జీని విడుదల చేస్తాయి. వీటినే ఈఎంఎఫ్ లు అని కూడా అంటారు. ఈ రేడియేషన్ ఆరోగ్యానికి చాలా డేంజర్. ఈ రేడియేషన్ వల్ల మీరు ఎన్నో అనారోగ్య సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది.

click me!