కుండలో తయారుచేసిన పెరుగు ఎంత మంచిదో తెలుసా?

First Published May 16, 2023, 3:39 PM IST

పెరుగులో ఎన్నో ఔషదగుణాలు ఉంటాయి. ఇలాంటి పెరుగును మట్టి కుండలో నిల్వ చేస్తే దీనిలోని పోషకాలు మరింత ఎక్కువవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 
 

పెరుగు అత్యంత ఆరోగ్యకరమైన, రుచికరమైన ఆహారాలలో ఒకటి. అందుకే భారతీయులు దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. పెరుగు పెర్ఫెక్ట్ గా వచ్చేలా చేయడం ఒక కళ. నిజానికి పెరుగులో మన  ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలు ఉంటాయి. అయితే పెరుగును స్టీల్ గిన్నె, గాజు పాత్రలో కాకుండా మట్టికుండలో వేయడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇది పెరుగు రుచిని పెంచుతుంది. ఆహారాన్ని మరింత మెరుగ్గా చేస్తుంది. మట్టి పాత్రలో పెరుగును తయారు చేయడం ఎన్నో శతాబ్దాలుగా వస్తోంది. ప్రపంచంలోని ఎన్నో ప్రాంతాల్లో ఇది సాంప్రదాయ పద్ధతిగా ఉంది. మట్టికుండలో పెరుగును తయారుచేయడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఖనిజాలు ఎక్కువ ఉంటాయి

మట్టి పాత్రలు సహజ బంకమట్టితో తయారవుతాయి. ఇందులో కాల్షియం, మెగ్నీషియం, ఇనుము వంటి ఎన్నో ఖనిజాలు ఉంటాయి. ఈ ఖనిజాలు పెరుగులోకి లీక్ అవుతాయ. దీంతో పెరుగు మరింత పోషకమైనదిగా మారుతుంది.
 

ప్రోబయోటిక్స్

ఇతర  పదార్థాల్లో తయారైన పెరుగుతో పోలిస్తే మట్టి పాత్రల్లో తయారు చేసిన పెరుగులో ప్రోబయోటిక్స్ ఎక్కువగా ఉంటాయి. ప్రోబయోటిక్స్ జీర్ణక్రియకు సహాయపడే, రోగనిరోధక శక్తిని పెంచే ప్రయోజనకరమైన బ్యాక్టీరియా. బంకమట్టి సున్నితమైన స్వభావం గాలి వెళ్లేలా చేస్తుంది. ఇది పెరుగు కిణ్వ ప్రక్రియకు సహాయపడుతుంది. ఇది పెరుగు నుండి అదనపు నీటిని గ్రహించడానికి సహాయపడుతుంది. దీంతో పెరుగు మందంగా, క్రీమీగా మారుతుంది.

ప్రత్యేకమైన మట్టి రుచిని ఇస్తుంది

బంకమట్టి ప్లాట్ మీ పెరుగుకు ప్రత్యేకమైన మట్టి రుచిని ఇస్తుంది. ఇలాంటి రుచిని వేరే ఏ పాత్రల్లో చూడరు. ఇది పెరుగును మరింత టేస్టీగా చేస్తుంది. 
 

ఆల్కలీన్ పదార్థం

పాల ఉత్పత్తులు ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటాయి. అయితే కుండలో పెరుగును తయారు చేసినప్పుడు దాని ఆమ్లతను సమతుల్యం చేసే ఆల్కలీన్ ప్రత్యామ్నాయాలు దానికి జోడించబడతాయి.
 

మందమైన స్థిరత్వం

మీరు మట్టి కుండలో పెరుగును తయారు చేసినప్పుడు ఇది సాధారణంగా మందంగా ఉంటుంది. ఎందుకంటే మట్టి కుండల రంధ్రాలు నీటిని గ్రహిస్తాయి.

click me!