చక్కెరను ఎక్కువగా తింటే ఇన్ని సమస్యలొస్తయా?

Published : May 16, 2023, 01:40 PM IST

చక్కెరతో చేసిన ప్రతి ఫుడ్ టేస్టీగా ఉంటుంది. అందుకే తీపిని చాలా మంది ఎక్కువగా తింటుంటారు. కానీ చక్కెర మన ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఎందుకంటే ఇది మనల్ని ఎన్నో రోగాల బారిన పడేస్తుంది. 

PREV
16
 చక్కెరను ఎక్కువగా తింటే ఇన్ని సమస్యలొస్తయా?
Image: Getty Images

బెల్లం కంటే చక్కెరనే ఎక్కువగా తింటుంటారు. ఎందుకంటే చక్కెరే ఎక్కువ టేస్టీగా ఉంటుంది. చక్కెరతో చేసిన ప్రతి ఫుడ్ ఎంతో రుచికరంగా ఉంటుంది. దీనివల్లే చాలా మంది మోతాదుకు  మించి చక్కెరను తింటుంటారు. నిజమేంటంటే చక్కెర మన ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఎందుకంటే ఇది మనల్ని ఎన్నో రోగాల బారిన పడేస్తుంది. సోడా, స్వీట్లు, కాల్చిన ఆహారాలు, రుచికరమైన స్నాక్స్ తో సహా ప్రాసెస్ చేసిన చాలా రకాల ఆహారాల్లో చక్కెర ఉంటుంది. చక్కెరను ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయంటే..? 
 

26
Image: Getty Images

బరువు పెరుగుతారు 

బరువు పెరిగినంత సులభంగా తగ్గరు. అందుకే బరువును పెంచే ఆహారాలను తినకూడదు. అయితే చక్కెరలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. దీన్ని మోతాదుకు మించి తింటే సులువుగా బరువు పెరుగుతారు. ఇది ఊబకాయానికి కూడా దారితీస్తుంది. చక్కెర తీసుకోవడం వల్ల వేగంగా శక్తి లభిస్తుంది. కానీ అదనపు శక్తి మీ శరీరంలో కొవ్వుగా నిల్వ ఉంటుంది.
 

36
Image: Getty Images

రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి

చక్కెర వినియోగం మన రక్తంలో చక్కెర స్థాయిలను కూడా ప్రభావితం చేస్తుంది. చక్కెరతో చేసిన తీపి ఆహారాలను తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అమాంతం పెరుగుతాయి. దీనివల్ల మన శరీరాలు వాటిని నియంత్రించడానికి ఇన్సులిన్ ను ఉత్పత్తి చేస్తాయి.
 

46
Image: Getty Images

శరీరంలో మంట

ఎక్కువ చక్కెరను తీసుకుంటే శరీరంలో మంట కలుగుతుంది. దీర్ఘకాలిక మంట క్యాన్సర్, గుండె జబ్బులు, స్వయం ప్రతిరక్షక రుగ్మతలతో సహా ఎన్నో రోగాలను కలిగిస్తుంది. 
 

56
Image: Getty Images

దంత క్షయం

చక్కెర తీసుకోవడం వల్ల వచ్చే మరో సమస్య దంత క్షయం. చక్కెరతో చేసిన ఆహారాన్ని తినేటప్పుడు చక్కెర మన నోటిలోని బ్యాక్టీరియాకు ఆహార వనరును అందిస్తుంది. ఇది దంతాల ఎనామెల్ ను నాశనం చేసే ఆమ్లాన్ని ఉత్పత్తి చేస్తుంది. అలాగే కావిటీస్ కు కారణమవుతుంది.

66
Image: Getty Images

మెదడు రుగ్మతలు

చక్కెరను మోతాదుకు మించి తీసుకోవడం వల్ల అభిజ్ఞా క్షీణత, చిత్తవైకల్యం సమస్యలు వచ్చే  ప్రమాదం ఉంది. ఎక్కువ చక్కెర ఇన్సులిన్ నిరోధకతకు కారణమవుతుంది. ఇది అభిజ్ఞా పనితీరును బలహీనపరుస్తుంది. అలాగే  అల్జీమర్స్ వ్యాధి వచ్చే ప్రమాదాన్ని పెంచుతుందని పరిశోధనల్లో తేలింది.

click me!

Recommended Stories