అలాగే ఆవు పాలలో కొవ్వు 4.4 గ్రాములు, కార్బోహైడ్రేట్లు 4.9 గ్రాములు, కాల్షియం 118 మి.గ్రాములు ఉంటాయి. ఇకపోతే గేదె పాలలో కొవ్వు 6.6 గ్రాములు, కార్భోహైడ్రేట్లు 8.3 గ్రాములు, కాల్షియం 121 మి.గ్రాములు ఉంటాయి. ఈ రెండు రకాల పాలలో లాక్టోస్ ఉంటుంది. ఇది ఆవు పాలలో 4.28 గ్రాములు ఉంటే, గేదె పాలలో 4.12 గ్రాములు ఉంటుంది.
గేదె పాలలో పొటాషియం, బీటా-లాక్టోగ్లోబులిన్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి అధిక రక్తపోటును నియంత్రించడానికి సహాయపడతాయి. అలాగే ఆవు పాల కంటే గేదె పాలలోనే తక్కువ కొలెస్ట్రాల్ ఉంటుంది.
ఈ పాలు హై బీపీ, ఊబకాయం, మూత్రపిండాల సమస్యలతో బాధపడుతున్న వారికి చాలా మంచివి. ఇకపోతే ఆవు పాలలో ప్రోటీన్లు, విటమిన్లు, పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి ఎముకలను బలంగా చేయడానికి, గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి.