ధనియాలలో పొటాషియం, కాల్షియం, విటమిన్ సి, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు వ్యాధులను దూరంగా ఉంచడంలో సహాయపడతాయి. ఇందులో ఉండే ఆంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీ రాడికల్స్ ను తగ్గించడంలో సహాయపడతాయి.
అంతేకాకుండా అనేక రకాలు వ్యాధులతో పోరాటంలో సహాయపడుతుంది. ఖాళీ కడుపుతో ధనియాలు వాటర్ తీసుకోవడం వలన జీర్ణవ్యవస్థకు చాలా మేలు చేస్తుంది. ఇది గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
అలాగే ధనియాల వాటర్ ని రెగ్యులర్ గా తీసుకోవడం వలన గుండె ఆరోగ్యంగా ఉంటుంది. దీనిని వాడకం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. తద్వారా గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అంతేకాకుండా బరువుని నియంత్రిస్తుంది. ఖాళీ కడుపుతో ధనియాల నీరు తాగటం వలన మలబద్ధకం, గ్యాస్ తొలగిస్తుంది.
దీనితో పొట్ట బాగా శుభ్రపడుతుంది. ఇది పొట్టలోని కొవ్వుని తొలగించడంలో సహాయపడుతుంది తద్వారా ఊబకాయం నుంచి ఉపశమనం పొందవచ్చు. అంతేకాకుండా ధనియాలు నీరు ని రోజూ తీసుకుంటే ధనియాలలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు..
చర్మాన్ని శుభ్రంగా, ఆరోగ్యంగా ఉండేలాగా చేస్తుంది. ధనియాల లో ఉండే అనేక రకాల యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. అంతేకాకుండా ఇందులో ఉండే విటమిన్ ఏ, విటమిన్ సి తో పాటు ఇంకా ఇతర పోషకాలు అనేకం ఉంటాయి. తద్వారా జలుబు, దగ్గు, జ్వరం నుంచి ఉపశమనం పొందవచ్చు.
అంతేకాకుండా ఖాళీ కడుపుతో ఈ నీటిని తాగడం మధుమేహ రోగులకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ధనియాల వాటర్ ని ఎలా తయారు చేస్తారంటే రాత్రి పడుకునే ముందు నీటిలో కాసిన్ని ధనియాలు వేసి నానబెట్టండి. పొద్దున్నే వాటిని మరిగించండి చల్లారిన తర్వాత ఖాళీ కడుపుతో ఆ ద్రవాన్ని సేవించండి. త్వరగా సన్నబడటమే కాకుండా ఇంకా అనేక రకాల ప్రయోజనాలని పొందండి.