మీరు ఆరోగ్యకరమైన జీవనశైలిని కలిగి ఉంటే మీరు ఒక కిడ్నీ తో కూడా ఆరోగ్యంగా బ్రతకవచ్చు. మీ జీవనశైలి పద్ధతిగా లేనప్పుడు రెండు కిడ్నీలు ఉన్నప్పటికీ మీరు ఆరోగ్యంగా బ్రతకలేరు. ఒక మనిషికి ఒక కిడ్నీ మాత్రమే పని చేయటానికి మూడు కారణాలు ఉంటాయి. ఒకటి పుట్టుకతోనే ఒక మూత్రపిండంతో పుట్టడం.
750 మందిలో ఒకరు ఇలాంటి సమస్యతో బాధపడుతున్నారు. రెండవది రెండు మూత్రపిండాలతో పుట్టినప్పటికీ ఆపరేషన్ ద్వారా ఒక కిడ్నీ తీసివేయడం. ఇలా చేయకపోతే క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి తీసేస్తారు.
ఇక మూడవది ఏమిటంటే.. పుట్టడం రెండు మూత్రపిండాలతోని పుడతారు కానీ ఒకటి మాత్రమే పని చేస్తుంది. ఇలాంటి వ్యక్తులకి రెండవ మూత్రపిండం కూడా సరిగ్గా పనిచేయదు లేదంటే పూర్తిగా పని చేయదు.ఇక ఒక కిడ్నీ ఉన్నవాళ్లు కూడా సరైన జీవన విధానంతో సాధారణంగా కంటే ఎక్కువ పనిని సులభంగా చేయగలరు.
అలాగే రెండు కిడ్నీలు ఉన్నవాళ్లు ఒక కిడ్నీని దానం చేయడం వలన భవిష్యత్తులో కిడ్నీ సమస్యలు వస్తాయని భయపడుతూ ఉంటారు. అది కూడా నిజం కాదు. పూర్తిగా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి నిర్భయంగా కిడ్నీని దానం చేయవచ్చు.
అలాగే కిడ్నీ దానం చేయటానికి 60 లోపు వయసు ఉన్న వ్యక్తులు అర్హులు. ప్రతి ఒక్కరి పరిస్థితుల్లో 60 సంవత్సరాలు దాటిన వారు కూడా కిడ్నీ దానం చేయాలి అనుకుంటే ముందుగా వారి శరీరం మొత్తాన్ని పరీక్షించి, ఆ వ్యక్తి పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లయితే అప్పుడు కిడ్నీ దానం చేయడానికి అర్హుడవుతాడు.
కాబట్టి ఒక కిడ్నీ గురించి మీరు ఎక్కువగాటెన్షన్ పెట్టుకోకండి. అవసరం అనుకుంటే తరచుగా వైద్యుని పర్యవేక్షణలో ఉండండి. అలాగే అతను చెప్పిన డైట్ చార్ట్ ని ఫాలో అవ్వండి. అలాగే తరచుగా వాంతులు, విపరీతమైన అలసట, సడన్ గా ముఖం వాచిపోవడం వంటివి జరిగితే మాత్రం వెంటనే వైద్యుని సంప్రదించండి.