మొలకెత్తిన గింజలు తినడం వలన ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ గింజల్లో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ బి 1, విటమిన్ b6, విటమిన్ కె ఎక్కువ ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అలాగే వీటిలో పీచు, ఫోలేట్, ఒమేగా త్రీ, కొవ్వు ఆమ్లాలు కూడా పుష్కలంగా ఉంటాయి.
అందుకే రోజువారి డైట్ లో వీటిని ఉపయోగించమని చెప్తారు డాక్టర్లు. వీటిని తినటం వల్ల జీర్ణ క్రియ మెరుగుపడటంతో పాటు బ్లడ్ షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి, గుండె జబ్బులు రాకుండా కాపాడుతాయి. అయితే వీటిని మనకి నచ్చినట్లుగా తినటం వలన ఫుడ్ పాయిజన్ జరిగే ప్రమాదం ఉంది.
అమెరికన్ హెల్త్ ఏజెన్సీ సెంటర్ ఫర్ డిసీస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం పచ్చి మొలకలు తినటం ద్వారా మీకు తెలియకుండానే అనేక వ్యాధులను ఆహ్వానిస్తున్నారని చెబుతుంది. మొలకెత్తే ప్రక్రియలో సాల్మొనెల్లా వంటి హానికరమైన బ్యాక్టీరియా మొలకలతో పాటు పెరుగుతుంది.
ఆ మొలకలు మీరు ఇంట్లో తయారు చేసుకున్నవి అయినప్పటికీ కూడా ఈ బ్యాక్టీరియా ప్రమాదాన్ని తగ్గించలేరు. పచ్చి మొలకలలో హానికరమైన బ్యాక్టీరియా ఉండడం వలన 12 నుంచి 72 గంటలు దాటిన తర్వాత ఈ పచ్చి మొలకలు తింటే ఫుడ్ పాయిజనింగ్ జరిగే అవకాశం ఉంటుంది.
దీని వలన అతిసారం, కడుపునొప్పి, వాంతులు వంటివి కలుగుతాయి. మొలకలు ఏ విధంగా తినాలో ఇప్పుడు చూద్దాం. పచ్చి మొలకలని డైరెక్ట్ గా తినటానికి చాలామందికి ఇబ్బందిగా ఉంటుంది, వాటిని కొద్దిగా నూనెలో వేడి చేయడం వలన వాటిలోని బ్యాక్టీరియా చనిపోతుంది. నూనెలో వద్దనుకుంటే ఉప్పు నీటిలో ఐదు నుంచి పది నిమిషాలు ఉడకబెట్టండి.
ఈ విధంగా మొలకలను వాడటం వలన మీ జీర్ణవ్యవస్థలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు, అంతేకాకుండా మీ జీర్ణ వ్యవస్థ మరింత మెరుగ్గా పోషకాలను గ్రహిస్తుంది. ఇప్పటికీ మీకు దీనిపై అవగాహన రాకపోతే సరియైన ఆహార నిపుణుడి సలహాతో మీ యొక్క డైట్ ప్లాన్ మైంటైన్ చేయవచ్చు.