లెమన్ టీ తాగే అలవాటు లేదా? ఇప్పటి నుంచి అలవాటు చేసుకున్నా ఈ రోగాలకు దూరంగా ఉంటారు

First Published | Oct 30, 2023, 9:44 AM IST

మనలో చాలా మంది టీని తాగకుండా అస్సలు ఉండలేరు. ముఖ్యంగా ఉదయం ఎట్టి పరిస్థితిలోనైనా టీని పక్కాగా తాగుతుంటారు. కొంతమంది అయితే సమయం సందర్భం లేకుండా టీని తాగేస్తుంటారు. కానీ టీని ఎక్కువగా తాగితే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. పాల టీకి  బదులుగా లెమన్ టీ తాగితే ఎంతో మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే? 
 

lemon tea

టీ.. ప్రపంచవ్యాప్తంగా ఇష్టపడే ఒక ఫేమస్ డ్రింక్. ముఖ్యంగా మన దేశంలో టీ ప్రియులకు కొదవే లేదు. మనలో చాలా మంది టీతోనే డేను స్టార్ట్ చేస్తారు. మరికొంతమంది ఒక కప్పు టీతో తమ రోజును ముగిస్తారు. మనం గమనించకపోయినా మనలో చాలా మంది  టీకి బనిసలయ్యారు. అంటే టీ లేకుండా అస్సలు ఉండలేరు. కానీ టీని ఎక్కువగా తాగితే లేనిపోని అనారోగ్య సమస్యలు వస్తాయి. అందుకే ఈ పాల టీ కంటే లెమన్ టీ బెటర్ అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

లెమన్ టీ మన శరీరానికి, మనస్సుకు ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తుంది. ఈ టీలోని రిఫ్రెషింగ్ గుణాలు మన మానసిక స్థితిని మెరుగుపరుస్తాయి. అలాగే ఇది ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది. చర్మాన్ని  ఆరోగ్యంగా ఉంచుతుంది. లెమన్ టీని తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 


అంటు వ్యాధుల నుంచి రక్షణ

తేలికపాటి చలి ప్రారంభమైంది. చలికాలం ప్రారంభం కాగానే చాలా మందికి జలుబు, దగ్గు, కఫం, గొంతునొప్పి వంటి ఎన్నో సమస్యలు వస్తాయి. అందుకే తేనెతో లెమన్ టీ తాగడం వల్ల ఈ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. నిమ్మకాయ రసంలో ఉండే యాంటీఆక్సిడెంట్లు ఈ సమస్యలను తగ్గిస్తాయి. అంతేకాదు ఇది అంటువ్యాధుల నుంచి మీరు కోలుకోవడానికి కూడా సహాయపడుతుంది. 
 

గుండె ఆరోగ్యానికి మేలు 

నిమ్మకాయల్లో హెస్పెరిడిన్, డయోస్మిన్ వంటి మొక్కల ఫ్లేవనాయిడ్లు ఉంటాయి. ఇవి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి సహాయపడుతాయి. అలాగే ప్రతిరోజూ సాయంత్రం ఒక కప్పు వేడి వేడి లెమన్ టీని తాగడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. 

lemon tea

నిర్విషీకరణ

నిమ్మకాయలో ఎక్కువ మొత్తంలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఇది కాలేయాన్ని నిర్విషీకరణ చేయడానికి సహాయపడుతుంది. ఒక కప్పు లెమన్ టీ ని తాగితే ఆహారం సులువుగా జీర్ణం అవుతుంది. అలాగే శరీరంలోని విషపదార్థాలు బయటకు పోతాయి. 
 

రక్తంలో చక్కెర నియంత్రణ 

లెమన్ టీ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి కూడా సహాయపడుతుంది. అంతేకాదు  ఇది శరీరంలో రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగకుండా కూడా నిరోధిస్తుంది. అలాగే ఈ టీ మీ ఆకలిని నియంత్రిస్తుంది. జీవక్రియను మెరుగుపరుస్తుంది. ఈ టీని తాగితే బ్లడ్ షుగర్ నార్మల్ గా ఉంటుంది. 
 

చర్మానికి మేలు 

లెమన్ టీలో ఆస్ట్రిజెంట్ లక్షణాలు ఉంటాయి. ఇవి చనిపోయిన చర్మ కణాలను తొలగించడానికి సహాయపడతాయి. అలాగే చర్మాన్ని పునరుత్తేజపరచడానికి కూడా సహాయపడతాయి. దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది మొటిమలు, మచ్చలు. తామరను తగ్గించడానికి సహాయపడుతుంది. లెమన్ టీ తాగితే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.

Latest Videos

click me!