గొంతునొప్పి ఎంతకీ తగ్గడం లేదా? వాటర్ ను గనుక ట్రై చేశారంటే తొందరగా తగ్గిపోతుంది

First Published | Oct 30, 2023, 10:44 AM IST

గొంతునొప్పి కారణమేదైనా దీనివల్ల ఏదీ తినలేరు. తాగలేరు. ఇది మింగడంలో ఇబ్బందిని కలిగిస్తుంది. అలాగే ఎప్పుడూ గొంతు నొప్పి కలుగుతుంది. అయితే దీన్ని కొన్నిసహజ చిట్కాలతో కూడా చాలా సులువుగా తగ్గించుకోచ్చు. 

చలికాలంలో రాకతో వాతావరణం మారుతోంది. చలితీవ్రత రోజు రోజుకు పెరుగుతుండటంతో చాలా మంది దగ్గు, జలుబు, గొంతు నొప్పి, గొంతు ఇన్ఫెక్షన్లతో బాదపడుతుతున్నారు. ఇలాంటి వాతావరణంలో మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఈ సీజన్ లో వచ్చే కామన్ అనారోగ్య సమస్యల్లో గొంతునొప్పి ఒకటి. దీనికి ఎన్నో కారణాలు ఉంటాయి.  దగ్గు, జలుబు వల్ల కూడా గొంతునొప్పి వస్తుంది. అలాగే బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ తో కూడా గొంతునొప్పి కలుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

గొంతునొప్పికి కారణమేదైనా దీనివల్ల ఏది తిన్నా, తాగినా విపరీతమైన నొప్పి కలుగుతుంది. అయితే దీన్ని మందులతోనే కాకుండా సహజ పద్దతుల ద్వారా కూడా తగ్గించుకోవచ్చంటున్నారు నిపుణులు. ఏదేమైనా సమస్య పెద్దగా అయితే మాత్రం ఖచ్చితంగా హాస్పటల్ కు వెళ్లాలి. గొంతునొప్పిని సహజంగా ఎలా తగ్గించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.. 

Latest Videos


ఉప్పు నీరు

ఉప్పునీరు కూడా గొంతునొప్పిని తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఇందుకోసం ఉప్పునీటిని పుక్కిలించాలి. దీంతో గొంతు ఇన్ఫెక్షన్ వల్ల కలిగే నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. గార్గ్లింగ్ చేస్తే కూడా గొంతునొప్పి తగ్గుతుంది. ఇందుకోసం ఒకగ్లాస్ నీటిని గోరువెచ్చగా చేసి అందులో అరటీస్పూన్ ఉప్పును వేసి పుక్కిలించాలి. అలాగే 5 నుంచి 7 నిమిషాల పాటు గార్గిల్ చేస్తే కూడా గొంతునొప్పి తగ్గుతుంది. అయితే ఈ గార్గిలింగ్ రాత్రిపూట చేస్తే మరింత ప్రభావవంతంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. 
 

పసుపు నీరు

పసుపు కూడా గొంతునొప్పిని తగ్గిస్తుంది. పసుపులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఇందుకు సహాయపడతాయి. ఈ పసుపు అంటువ్యాధులను నయం చేయడానికి బాగా సహాయపడుతుంది. వేడి పాలు లేదా నీళ్లలో  అర టీస్పూన్ పసుపును మిక్స్ చేసి తాగితే గొంతు ఇన్ఫెక్షన్, కఫం సమస్యలు తొలగిపోతాయి. రాత్రిపూట ఈ నీటిని తాగితే ఇంకా ప్రభావవంతంగా ఉంటుంది. 
 

ఆవిరి

ఆవిరి పట్టడం వల్ల కూడా గొంతునొప్పి సమస్య పోతుంది. ఆవిరితో ఎగువ శ్వాసనాళంలో శ్లేష్మంతో పాటు ఉత్పత్తి అయ్యే బ్యాక్టీరియా తొలగిపోతుంది. ఒక పాత్రలో నీళ్లను వేడి చేసి  మీ చుట్టూ ఒక టవల్ కప్పి మీ తలను పాత్రకు దగ్గరగా పెట్టండి. ఆ తర్వాత లోతైన శ్వాస తీసుకోండి. వాటర్ మరీ వేడిగా ఉంటే.. తలను వాటర్ కు మరీ దగ్గరగా పెట్టకండి. 
 

వెల్లుల్లి 

వెల్లుల్లిలో యాంటీ బాక్టీరియల్, యాంటీసెప్టిక్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. గొంతు నొప్పి సమస్య ఉంటే పచ్చి వెల్లులిని తినండి. గొంతునొప్పి తొందరగా తగ్గాలంటే రోజుకు మూడు నుంచి నాలుగు వెల్లుల్లి రెబ్బలను పచ్చిగా అలాగే నమిలి తినండి. ఇది గొంతు ఇన్ఫెక్షన్ నుంచి ఉపశమనం కలిగిస్తుంది. మీ జీర్ణవ్యవస్థ కూడా మెరుగ్గా ఉంటుంది. 
 

click me!